ఉత్సాహంగా అంధ ఉద్యోగుల క్రీడలు
హన్మకొండ: లూయీస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకుని అంధ ఉద్యోగ, ఉపాధ్యాయులకు క్రీడాపోటీలు నిర్వహించారు. హనుమకొండ రాంనగర్‌లోని అంధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం కార్యాలయంలో మహిళలకు స్కిప్పింగ్, సాంగ్స్, అంత్యాక్షరి, పురుషులకు చెస్, త్రోబాల్, షాట్‌ఫుట్ పోటీలు జరిగాయి. అంధ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.లింగయ్య, ప్రధాన కార్యదర్శి ఎల్.రవీందర్ మాట్లాడుతూ జనవరి 4న అంధుల ఆశాజ్యోతి లూయీస్ బ్రెయిలీ జయంతిని హనుమకొండలోని జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు బ్రెయిలీ అని అన్నారు. జె.రాంబాబు, కార్తీక్, శైలజ, కృష్ణ, రాజు పాల్గొన్నారు.


