విపత్తుల నివారణపై అవగాహన ఉండాలి
● వీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
రామకృష్ణారావు
జనగామ రూరల్: విపత్తుల నివారణకు సంబంధిత యంత్రాంగానికి తప్పనిసరిగా అవగాహన ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వరదలు, పరిశ్రమల ప్రమాదాల నివారణపై ఈనెల 22న నిర్వహించనున్న మాక్ ఎక్సర్‌సైజ్ లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎన్ డీఎంఏ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ) డైరెక్టర్ సుధీర్ బాల్, తెలంగాణ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ నారాయణరావు, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. వరదలు, పరిశ్రమల, రహదారుల ప్రమాదాలే కాక వివిధ రకాలుగా జరిగే విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, ముందు జాగ్రత్తలపై సంబంధిత శాఖల యంత్రాంగానికి పూర్తి అవగాహన ఉండాలన్నారు. వీసీలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్, అగ్నిమాపక, పంచాయతీ రాజ్ తదితర అధికారులు పాల్గొన్నారు.


