
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
జనగామ రూరల్: వర్షాకాలంలో సీజనల్ వాధ్యులు ప్రబలే అవకాశం ఉందని ప్రతీఒక్కరు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు అన్నా రు. మంగళవారం పట్టణంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా గర్భిణులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారులకు సీజనల్ వ్యాధులు, ము ఖ్యంగా డెంగీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, లార్వా పెద్ద దోమలను నిర్మూలించే చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం ఆ స్పత్రిలోని రిజిస్టర్‌లు, రికార్డ్‌లు పరిశీలించారు.
డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు