
బ్రిడ్జికి మరమ్మతు చేపట్టాలి
జనగామ రూరల్: పట్టణంలోని నెహ్రూ పార్క్ నుంచి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి వరకు కాజీపేట హైదరాబాద్ రైల్వే క్రాసింగ్ కోసం ఏర్పాటు చేసిన బ్రిడ్జి పెచ్చులూడి పోతున్నాయని, వెంటనే మరమ్మతు చేపట్టాలని సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ 38 సంవత్సరాల క్రితం నిర్మించిన బ్రిడ్జి కావడంతో పగుళ్లు ఏర్పడి పెచ్చులూడిపోతున్నాయన్నారు. ముఖ్యంగా మెట్లదారులు కూలిపోయి శిథిలావస్థలో ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి ముందు లైట్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి మరమ్మతు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండీ హజారుద్దిన్, మంగ బీరయ్య, బండ సౌందర్య, గాజుల నాగరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.