
బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025
న్యూస్‌రీల్
● సహజ, ప్రమాదవశాత్తు మరణిస్తే తక్షణ సాయం రూ.20వేలు
● జిల్లాలో ఇప్పటి వరకు 880 మందికి రూ.1.76కోట్లు అందజేత
● పథకం అమలులో రాష్ట్రంలోనే రెండో స్థానం
● ప్రజలకు అవగాహన కల్పించాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా
‘ఎన్‌ఎఫ్‌బీఎస్’తో
ఆర్థిక భరోసా!
జనగామ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్‌ఎఫ్‌బీఎస్) పేదలకు ఆర్థిక భద్రత కలిగిస్తోంది. కుటుంబ పెద్ద అకాల మరణం చెందిన సమయంలో తక్షణ ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకాన్ని సమగ్ర గ్రామీణాభివృద్ధి కార్యక్రమం (ఎన్‌ఎస్‌ఏపీ) పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. గ్రామీణ, పట్టణ జనాభాలో పేదరికంలో (బీపీఎల్) జీవిస్తున్న కుటుంబాలు మాత్రమే దీనికి అర్హులు. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన కుటుంబ సభ్యుడు మరణించిన సమయంలో ఈ పథకం వర్తిస్తుంది. లబ్ధిదారుల కుటుంబానికి రూ.20 వేల నగదును ఒకేసారి అందిస్తారు.
ఆర్థిక ప్రయోజనాలు..
అకస్మాత్తుగా కుటుంబ పెద్ద మరణిస్తే ఆదాయం ఆగిపోయే పరిస్థితుల్లో తక్షణ ఆర్థిక సాయం కొండంత భరోసా కల్పిస్తుంది. పిల్లల చదువు అర్థాంతరంగా ఆగిపోకుండా, కుటుంబ జీవనం ముందుకు సాగడానికి దోహదం చేస్తుంది. బాధిత కుటుంబం మరింత దారిద్య్రంలోకి జారిపోకుండా రూ.20వేల ఆర్థిఽక సాయం మేలు చేస్తుంది. దీంతో ఆర్థిక నష్టాన్ని తట్టుకొని మళ్లీ జీవనోపాధి కొనసాగించేందుకు ధైర్యం కలిగిస్తుంది.
880 మంది.. రూ.1.76 కోట్లు
జిల్లాలో ఈ పథకానికి 954 మంది దరఖాస్తు చేసుకోగా, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. ఇందులో 880 బాధిత కుటుంబాలకు రూ.20వేల చొప్పున రూ.1.76 కోట్ల నగదును నామినీ బ్యాంకు ఖాతాలో జమ చేశారు.
దరఖాస్తు ఇలా...
కుటుంబ పెద్ద దిక్కు మరణించిన వెంటనే డెత్ సర్టిఫికెట్‌తో పాటు సంబంధిత పత్రాలతో స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో విచారణ పూర్తి చేసిన అనంతరం పాలక ప్రభుత్వాల నుంచి ఆర్థిక సాయం కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. అర్హత ఉన్నట్లు గుర్తించిన వెంటనే నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రాం ద్వారా కేంద్రం రాష్ట్రాలకు నిధులు మంజూరు చేయగా, అక్కడ నుంచి బాధిత కుటుంబాలకు చేరుతుంది. నగదును నామినీ బ్యాంక్ ఖాతాకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) ద్వారా జమ చేస్తారు.
ప్రజలకు అవగాహన కల్పించాలి
ఎన్‌ఎఫ్‌బీఎస్ పథకంపై జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు మరింత అవగాహన కల్పించాలి. కుటుంబానికి ఆసరాగా నిలిచే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే పేద కుటుంబాల పరిస్థితి చెప్పలేము. ఈ పథకం ద్వారా అందించే రూ.20 వేల ఆర్థికసాయం ఎంతోకొంత మేలు చేస్తుంది. పథకం అమలులో జిల్లా రాష్ట్రంలోనే రెండవ స్థానంలో ఉంది. దీనికి కారణం ప్రజలకు అవగాహన కల్పించడంలో విజయం సాధించాం.
– రిజ్వాన్ బాషా, కలెక్టర్
అర్హులు వీరే..
మరణించిన కుటుంబ పెద్ద 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
బాధిత కుటుంబం బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండాలి.
సహజ లేదా ప్రమాదవశాత్తు మరణించిన రెండేళ్ల లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఏఏబీవై, జేబీవై, ఆపద్బంధు పథకాల లబ్ధిదారులు అనర్హులు.
రెవెన్యూ డివిజన్ బాధిత నగదు
కుటుంబాలు (రూ.లక్షల్లో)
జనగామ 469 93.80
స్టేషన్‌ఘన్‌పూర్ 411 82.20
మొత్తం 880 1.76 కోట్లు
రైతులకు తెలియకుండా
సీఈఓ బినామీ రుణాలు
రుణమాఫీ కోసం
ప్రభుత్వానికి తప్పుడు వివరాలు
ఉన్నతస్థాయి విచారణలో గుట్టురట్టు
రూ.39.12 లక్షలు దుర్వినియోగం
పోలీస్‌స్టేషన్‌లో అధికారుల ఫిర్యాదు, కేసు నమోదు

బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025

బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025

బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025

బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025