
నిడిగొండ సొసైటీలో శఠగోపం
రఘునాథపల్లి: మండలంలోని నిడిగొండ ప్రాథమి క వ్యవసాయ సహకార సంఘంలో భారీ అవినీతి బహిర్గతమైంది. రైతులకు తెలియకుండా వారి పేరిట రుణాలు తీసుకోవడంతో పాటు రుణమాఫీ కోసం ప్రభుత్వానికి తప్పుడు వివరాలు పంపి కోట్లాది రూపాయలు కొల్లగొట్టే కుట్ర బయటపడింది. ఉన్నతాధికారుల విచారణలో రూ.39 లక్షలు దుర్వినియోగమైనట్లు నిర్ధారణ అయింది. దీంతో సొసైటీ మాజీ సీఈఓ పెద్దగోని వెంకటరాజయ్య, అతని కుమారుడు పెద్దగోని రాజ్‌కుమార్‌లపై రఘునాథపల్లి పోలీస్‌స్టేషన్‌లో కోఆపరేటివ్ విభాగం అసిస్టెంట్ రిజిస్టార్ వేముల వేణుగోపాల్ మంగళవారం ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపిన వి వరాల ప్రకారం.. నిడిగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 11 గ్రామాల పరిధిలో 3,760 మంది సభ్యులున్నారు. 2024 సంవత్సరంలో ప్రభుత్వం రుణమాఫీ రైతుల అర్హుల జాబితా కో రింది. గతంలో సొసైటీ సీఈఓలుగా పని చేసిన తండ్రీకొడుకులు వెంకటరాజయ్య, రాజ్‌కుమార్‌లు సొసైటీ నుంచి 554 మంది రుణాలు తీసుకున్నార ని, వారి ఆధార్ నంబర్లతో సహ రుణమాఫీ కోసం ప్రభుత్వానికి పంపారు. ఆ జాబితాలో 36 మంది రైతులు మాత్రమే అర్హులు కాగా ..తనిఖీలో 518 మంది రైతు రుణాలు తీసుకున్నారన్నది నకిలీవిగా గుర్తించారు. 518 మంది పేరిట రూ 2,31,89,605 లను మోసపూరితంగా తీసుకోవాలని సర్కారుకు వివరాలు పంపినట్లు అంతర్గత విచారణలో తేలింది. వెంకటరాజయ్య రైతులకు తెలియకుండా వారి పేర్లతో (బినామీ పేర్లతో) రూ.7,09,266 అప్పు తీసుకున్నట్లు గుర్తించారు. విచారణ నివేదికలోని విషయాలను జతపరుస్తూ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
తండ్రి పదవీవిరమణ.. కొడుకు కార్యదర్శి
సహకార సంఘం కార్యదర్శిగా పని చేసిన వెంకటరాజయ్య జూన్ 30, 2016న పదవీ విరమణ చేశారు. ఆయన కొడుకు రాజ్‌కుమార్‌ను కార్యదర్శిగా నియమించారు. సంస్థలో వెంకటరాజయ్య తాత్కాలిక ఉద్యోగిగా తనకు తానే నియమించుకొని సంఘం ఆర్థిక లావాదేవీలు చూస్తున్నారు. తండ్రీకొడుకులు నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో సీఈఓ రాజ్‌కుమార్‌ను డీసీ ఓ సస్పెండ్ చేశారు. ఫిర్యాదుల పరంపర నేపధ్యంలో డీసీఓ ఆదేశాలతో అసిస్టెంట్ రిజిస్టార్ దివ్య విచారణ నిర్వహించారు. భారీగా ఆర్థిక దుర్వినియోగం జరిగినట్లు తేల్చారు.
విచారణలో గుర్తించిన అంశాలు..
చిన్నం మల్లయ్య పేర రూ.1.06,146, దొరగొల్ల సత్తయ్య రూ.48,177, కుక్కల యాదయ్య రూ.48, 093, మద్దూరి మల్లయ్య రూ. 54,029, మద్దూరి రాజు రూ.1.08,745, నీల సదయ్య రూ.90,000, నీల యాకయ్య రూ. 55,000, పొరెడ్డి మోహన్‌రెడ్డి రూ.1,12,149 పేర్లపై రుణాలు తీసుకొని దుర్విని యోగం చేశారు. పైగా వెంకటరాజయ్య జూన్ 30, 2016న పదవీ విరమణ చేయగా.. అధికారుల అ నుమతి లేకుండా (ఉత్తర్వులు) జూలై 1, 2016 నుంచి జనవరి 31, 2024 వరకు రూ.11.37 లక్షలు వేతనంగా తీసుకున్నారు. మహేందర్ అనే రైతు రు ణం చెల్లింపు కోసం రూ.30 వేలు చెల్లించగా ఖా తాలో జమ చేయలేదు. ఎరువులు అమ్ముకొని రూ. 5,39,915, దుర్వినియోగం, ఓచర్స్ లేకుండా రూ. 3, 51,057 లక్షలు ఖర్చు చేసినట్లు విచారణలో వెల్ల డైంది. ఇలా తండ్రీకొడుకులు కలిసి రూ.39,13, 048 నిధులు దుర్వినియోగం చేసినట్లు తేల్చారు.