
కొరత సృష్టిస్తే చర్యలు
నర్మెట: యూరియా కొరత సృష్టించినా.. అధిక ధరలకు విక్రయించినా ఫర్టిలైజర్ షాపు యజమానులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మండలకేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. రైతులతో ఫోన్‌లో మాట్లాడి యూరియా కొనుగోలు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులు, పరిసరాలను పరిశీలించి సిబ్బంది హాజరు పట్టికను, టీబీ, డెంగీ, మలేరియా వ్యాధిగ్రస్తులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారి ఉదయ్ కిరణ్‌కు సూచించారు. ఆయన వెంట డీఏఓ అంబికాసోని, తహసీల్దార్ మోహసిన్ ముజ్తాబా, ఏఓ సింగారం కరుణాకర్, ఆర్‌ఐ సింగారపు సాయిబాబా, ఏఈఓ సుంకరి జగదీష్ తదితరులున్నారు.
రైతువేదిక ఎదుట రైతుల నిరసన
తరిగొప్పుల: మండలకేంద్రంలోని కొందరు ఫర్టిలైజర్ షాపు యజమానులు కావాలనే యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని రైతులు మంగళవారం రైతువేదికలోని వ్యవసాయశాఖ కార్యాలయం ఎ దుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని రైతులకు పంపి ణీ చేయడానికి తీసుకువచ్చిన యూరియాను ఇతర మండలాలకు చెందిన రైతులకు విక్రయిస్తున్నారన్నారు. రైతులు అజ్మీర రమేష్, జాటోతు రవి, జాటోతు సమ్మయ్య, భాస్కర్ పాల్గొన్నారు.
వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలి
కలెక్టర్ రిజ్వాన్ బాషా