
శాంతిభద్రతల పరిరక్షణలో ముందుండాలి
తరిగొప్పుల: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ముందుండాలని ఏఎస్పీ చేతన్ నితిన్ అన్నారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు, సిబ్బంది కిట్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులో ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలన్నారు. నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో గంజాయి విక్రయిస్తే సమాచారం అందించాలన్నారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీఐ అబ్బయ్య, ఎస్సై గుగులోతు శ్రీదేవి, ఏఎస్సై కాసర్ల రాజయ్య సిబ్బంది పాల్గొన్నారు.
ఏఎస్పీ చేతన్ నితిన్