
ఆదాయం ఫుల్
● జనగామ ఆర్టీసీకి రూ.1.73కోట్ల ఆదాయం
జనగామ: జనగామ ఆర్టీసీ డిపోకు రాఖీ పండుగ భారీ టికెట్ కలెక్షన్లను తెచ్చి పెట్టింది. ఈ నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 2,26,790 కిలో మీటర్లు తిరిగిన బస్సు సర్వీసులు, 3,16,762 మంది ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చింది. పండుగ నేపధ్యంలో అదనంగా 25,921 కిలోమీటర్లు తిరుగగా, రూ.31.35లక్షల టికెట్ కలెక్షన్లు పెరిగాయి. దీంతో ఐదు రోజుల ఆదాయం రూ.1.73కోట్లు వచ్చింది. సగటున అక్యుపెన్సీ 112 ప్రగతి సాధించారు. ప్రయాణికులకు ఎ లాంటి ఇబ్బంది కలుగకుండా కట్టుదిట్టమైన చ ర్యలు తీసుకున్నామని డిపో మేనేజర్ స్వాతి తెలి పారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెయింటెనెన్స్, ట్రా ఫిక్ విభాగం, ఆఫీసు, సెక్యూరిటీ, అవుట్ సోర్సింగ్ సిబ్బంది, అద్దె బస్సు డ్రైవర్లు, ఓనర్ల సహకారంతో పండుగ రద్దీని విజయవంతంగా సురక్షిత ప్రయాణం చేసేందుకు కష్టపడ్డారన్నారు.