
ఇష్టారాజ్యంగా యూరియా అమ్మితే చర్యలు
రఘునాథపల్లి: ఇష్టారాజ్యంగా యూరియా అమ్మితే చర్యలు తప్పవని, సాగు భూమి వివరాలు, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ప్రతులను తీసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఫర్టిలైజర్ షాపు యజమానులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆగ్రోస్, శ్రీలక్ష్మి ఫర్టిలైజర్ షాపులను వ్యవసాయ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్ పరిశీలించి దుకాణంలో ఉన్న నిల్వను సరిపోల్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యూరియా ఎలాంటి కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కలెక్టర్ వెంట డీఏఓ అంబికాసోని, ఏడీఏ వసంతసుగుణ, ఏఓ కాకి శ్రీనివాస్‌రెడ్డి, ఏఈఓ కల్పన తదితరులు ఉన్నారు.
విద్యతో పాటు క్రీడలపై ఆసక్తి చూపాలి
విద్యార్థినులు విద్యతో పాటు క్రీడలపై ఆసక్తి చూపాలని కలెక్టర్ తెలిపారు. ఖిలాషాపూర్ కేజీబీవీలోని స్టోర్ రూంను సందర్శించి నిల్వ చేసిన వంట సామగ్రి, కూరగాయలను పరిశీలించారు. తరగతి గదిలో విద్యార్థినులతో మాట్లాడుతూ విద్యాతో పాటు క్రీడలపై ఆసక్తి చూపాలన్నారు. మెనూ ప్రకారం భో జనం పెడుతున్నారా? స్పోర్ట్స్ పీరియడ్ ఎప్పుడు అ ని పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ఫణికిశోర్, తదితరులు ఉన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా
పలు ఫర్టిలైజర్ షాపులు,
కేజీబీవీ తనిఖీ