
మెరుగైన వైద్యం అందించాలి
బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025
● డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు
పాలకుర్తి టౌన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, సాధారణ ప్రసవాలను పెంచాలని డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత శ్రేణి ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో జ్వర పీడీతులు ఎక్కువగా ఉంటే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేన్సర్ అనుమానిత మహిళలను గుర్తించి ఆరోగ్య మహిళా క్లీనిక్‌కు రెఫర్ చేయాలని సూచించారు. మండలంలోని అన్ని గురుకుల పాఠశాలలకు మందులు సరఫరా చేయాలన్నారు. అనంతరం పీహెచ్‌సీ సిబ్బంది విరాళంతో టీబీ రోగులకు పోషకాహార కిట్లను అందించారు. ఈ సమావేశంలో వైద్యాధికారి సిద్దార్థ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
న్యూస్‌రీల్

మెరుగైన వైద్యం అందించాలి