
భూ భారతి చట్టంతో సమస్యల పరిష్కారం
పాలకుర్తి టౌన్/కొడకండ్ల: భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. 2025 భూ భారతి చట్టం అమలుపై సోమవారం పాలకుర్తి, కొడకండ్ల మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో నిర్వహించిన అవగాహ న సదస్సుల్లో ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరు వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు పూర్తి చేయడంతో పాటు మే ఒకటి నుంచి ఎంపిక చేసిన పైలట్ మండలంలో చట్టం అమలు చేస్తూ రైతుల నుంచి భూములకు సంబంధించిన సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పా రు. జూలై నుంచి అన్ని మండలాల్లో అమలు చేస్తామని వివరించారు.
అన్ని సమస్యలు తీరుతాయి :
ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పాలకుర్తిలో నిర్వహించిన సదస్సులో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ భూ భారతి చట్టంతో రైతుల అన్ని భూ సమస్యలు తీరుతాయని చెప్పారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రైతులు ధరణితో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ మోసపోయారన్నారు. ధరణి సమస్యలేని ఊరు, తండా లేదని చెప్పారు. భూ భారతి చట్టం ద్వారా భూముల రికార్డు పారదర్శకంగా నిర్వహించి భవిష్కత్ తరాలకు భూ హక్కుల విషయంలో స్పష్టత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో అదపు కలెక్టర్ రోహిత్‌సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హనుమనాయక్, ఏడీఏ పరశురాంనాయక్, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ మంజుల తదితరులు పాల్గొన్నారు.
రైతులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
కొడకండ్ల : అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. స్థానిక మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రాన్ని సోమవారం సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. టార్పాలిన్ కవర్లతో పాటు ధాన్యాన్ని తూర్పారబట్టే మిషన్లు సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా మరిన్ని పంపిస్తామని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్, తహసీల్దార్ చంద్రమోహన్, సీనియర్ అసిస్టెంట్ సుమన్, ఏఓ విజయ్‌రెడ్డి, ఏపీఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అవగాహన సదస్సుల్లో
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా