‘ఉపాధి’లో వెలుగులు | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’లో వెలుగులు

Mar 10 2025 10:42 AM | Updated on Mar 10 2025 10:38 AM

జనగామ రూరల్‌: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌)లో ఇకపై కూలీల సంఖ్య పెరగనుంది. భూమి లేని వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి రూ.12వేలు అందజేస్తోంది. అయితే లబ్ధిదారుల ఎంపికకు ఉపాధి హామీ పనులనే ప్రామాణికంగా తీసుకోవడంతో ఉపాధి పనులకు మరింత డిమాండ్‌ పెరుగనుంది. ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి పనులకు వెళ్తేనే పథకం వర్తించడంతో జాబ్‌ కార్డుల అవసరం కానుంది. జాబ్‌ కార్డులు ఉన్నా పలువురు కూలీ పనులకు వెళ్లలేదు. దీంతో గత జనవరి 26న ప్రకటించిన లబ్ధిదారుల జాబితాలో చాలా మందికి చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈసారైనా పనులను సద్వినియోగం చేసుకోవాలని కూలీలు భావిస్తున్నారు. ఉపాధి ప్రణాళికలో వచ్చే 2025–26లో ఉపాధి కూలీల సంఖ్య పెరగనుంది.

ఉపాధికి మరింత ఆదరణ

గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు నివారించాలనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించి కూలీల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఈ పథకం ద్వారా పలువురు కూలీలు స్వ గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారు. జాబ్‌ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి 100 రోజుల పాటు పని కల్పించాలనేది ఈ పథకం లక్ష్యం. గ్రామాల్లో ప్రతీఏడాది ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు ఐదు నెలల పాటు ఉపాధి పనులు జోరుగా సాగుతుంటాయి. వేసవిలో వ్యవసాయ పనులు అంతగా లేకపోవడంతో కూలీలు ఉపాధి పనులపై ఆసక్తి చూపుతారు. జిల్లాలో 281 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనులు చేపడుతుండగా ఏటా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా హాజరవుతున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో ఉపాధి హామీ పథకానికి మరింత ఆదరణ లభించనుంది.

‘ఆత్మీయ భరోసా’కు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ లింక్‌

20 రోజులు పని చేస్తేనే పథకం వర్తింపు

గ్రామాల్లో పెరుగనున్న కూలీల సంఖ్య

జిల్లాలో 1.18 లక్షల జాబ్‌కార్డులు

ఉపాధి హామీకి ఆదరణ

గతంలో కంటే ఈసారి ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో 8 వేలకు పైగా పనులకు హాజరవుతున్నారు. ఈనెల చివరి నాటికి ఉపాధి కూలీల సంఖ్య పెరుగుతుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలుతో ఉపాధి హామీ పథకానికి ఆదరణ పెరగనుంది. పని ప్రదేశాల్లో కూలీలకు తగిన వసతులు కల్పిస్తాం.

– వసంత, డీఆర్‌డీఓ

‘ఉపాధి’లో వెలుగులు1
1/2

‘ఉపాధి’లో వెలుగులు

‘ఉపాధి’లో వెలుగులు2
2/2

‘ఉపాధి’లో వెలుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement