టెండర్లు జరిగేనా..? | - | Sakshi
Sakshi News home page

టెండర్లు జరిగేనా..?

Nov 21 2026 12:08 AM | Updated on Nov 21 2026 12:08 AM

జగిత్యాల: జగిత్యాల డివిజన్‌ కేంద్రంగా ఉన్నప్పుడు 20 ఏళ్ల క్రితం మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లకు టెండర్లు నిర్వహించారు. అప్పుడు టెండర్‌ పొందిన కొందరు ఇతరులకు అద్దెకు ఇచ్చుకుని దందా కొనసాగిస్తున్నారు. ఇంత వ్యవహారం జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఇటీవల జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లకు టెండర్లు చేపట్టాలని నిర్ణయించారు. కాగా, గత నిర్వాహకుల నుంచి ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు వస్తున్నాయి. వారంతా ఒక్కటై టెండర్లు నిర్వహించకుండా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

షాపింగ్‌ కాంప్లెక్స్‌లకు నోటీసులు

జగిత్యాల బల్దియాలో 198 దుకాణ సముదాయాలు ఉన్నాయి. గతంలో టెండర్‌ పొందిన గుత్తాదారులకు వెంటనే ఖాళీ చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ నోటీసులు జారీ చేశారు. దీంతో వారు తీవ్ర ప్రయత్నాలు చేసి ఆపేలా చూస్తున్నారు. నిబంధనల ప్రకారం మూడేళ్లకోసారి టెండర్లు నిర్వహించాలి. జగిత్యాల జిల్లాగా ఏర్పడి పదేళ్లు అవుతుండగా, మార్కెట్‌ ధరలు, వాణిజ్య వ్యాపారాలు రోజురోజుకు పెరిగిపోయాయి. మున్సిపల్‌ కాంప్లెక్స్‌లు విలువైన స్థలాల్లో ఉండటంతో వాటికి అద్దె సైతం అత్యధికంగా వస్తుంది. కాగా, టెండర్లు నిర్వహించకపోవడంతో గతంలో పొందిన వారు అప్పటి అద్దెనే చెల్లిస్తున్నారు. అందులో కూడా కొందరు పూర్తిగా చెల్లించని వారు ఉన్నారు.

198 దుకాణాలు

జగిత్యాల మున్సిపల్‌కు సంబంధించి షాపింగ్‌ కాంప్లెక్స్‌ అంగడిబజార్‌, పార్క్‌ సంది, ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా, పాతబస్టాండ్‌ సమీపంలో 198 దుకాణాలున్నాయి. ఇందులో ఒకట్రెండు మినహా అన్ని అద్దెకే నడుస్తున్నాయి. 20 ఏళ్ల క్రితం టెండర్ల ద్వారా బల్దియాకు రూ.10 కోట్ల ఆదాయం వచ్చింది. మళ్లీ టెండర్లు నిర్వహిస్తే మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రైవేటు కాంప్లెక్స్‌లకు సుమారు రూ.20–రూ.30 వేల అద్దె ఉంటుంది. మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో మాత్రం అతి తక్కువ రూ.10 వేల అద్దెకు కొనసాగుతున్నాయి. గతంలో టెండర్లు పొందిన వారే అత్యధికంగా రెంట్‌కు ఇస్తూ లబ్ధి పొందుతున్నారు. ఇప్పటికై నా త్వరగా టెండర్లు పూర్తి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

20 ఏళ్ల క్రితం బల్దియా షాపింగ్‌ కాంప్లెక్స్‌లకు టెండర్లు

ఏళ్లు గడుస్తున్నా పాతవారే కొనసాగింపు

టెండర్లు వేయాలని ఇటీవల కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం

వేయకుండా ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు?

టెండర్లు నిర్వహిస్తాం

మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లకు త్వరలో టెండర్లు పిలుస్తాం. మూడు విడతల్లో నిర్వహించాలని నిర్ణయించాం. మొదటి విడతలో 28 షాపింగ్‌ కాంప్లెక్స్‌లకు టెండర్లు వేయగా, ముగ్గురే హాజరు కావడంతో మళ్లీ టెండర్‌ నిర్వహిస్తాం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. కౌన్సిల్‌ నిర్ణయం ప్రకారం ముందుకెళ్తాం.

– సత్యప్రణవ్‌, మున్సిపల్‌ కమిషనర్‌, జగిత్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement