మహిళా గ్రూపులకు ప్రత్యేక నిధులు | - | Sakshi
Sakshi News home page

మహిళా గ్రూపులకు ప్రత్యేక నిధులు

Nov 21 2026 12:08 AM | Updated on Nov 21 2026 12:08 AM

జగిత్యాల: మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన మహిళలందరినీ పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండాలనే లక్ష్యంతో ఇటీవల స్వయం సహాయక సంఘాలను నూతనంగా ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 1,073 కొత్త సంఘాలు ఏర్పడ్డాయి. వీరికి ఒక్కో గ్రూపునకు రూ.15 వేల చొప్పున అందజేస్తున్నారు. ఈ మేరకు జిల్లా నుంచి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ప్రత్యేకంగా నిధులు

18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రోత్సాహకంగా రివాల్వింగ్‌ ఫండ్‌ అందిస్తున్నారు. ఇప్పటికే కొత్త పొదుపు సంఘాల వివరాలు పంపించాలని డీఆర్డీఏ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెలాఖరులోగా ఆయా సంఘాల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.

ఇప్పటికే అధికారులు ఆయా సంఘాలకు సంబంధించిన ఆధార్‌, బ్యాంక్‌ ఖాతాల వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.

జిల్లాకు రూ.1.60 కోట్లుట్ల మంజూరు

ఒక్కో గ్రూపునకు రూ.15 వేల చొప్పున మంజూరు కాగా, జిల్లాకు రూ.1.60 కోట్లు రానున్నాయి. ఇప్పటికే సంఘాలకు ప్రభుత్వం బ్యాంక్‌ లింకేజీ రుణాలు అందిస్తూ వివిధ వ్యాపారాలకు ప్రోత్సహిస్తున్నారు. ఇటీవలే పెట్రోల్‌బంక్‌లు, అద్దె బస్సులు, పాలవ్యాపారాల్లో మహిళలు అడుగు పెడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రూపు, వ్యక్తిగతంగా లోన్లు ఇవ్వడంతో మహిళలు ఎక్కువగా కుటీర పరిశ్రమలు చేపడుతున్నారు. కొత్తగా మహిళ సంఘాలకు ప్రత్యేక నిధులు అందజేయడం ద్వారా ఆర్థిక సాధికారత సాధించే అవకాశాలున్నాయి.

మహిళల సాధికారతే లక్ష్యం

కొత్త సంఘాలకు ప్రోత్సాహకంగా ఒక్కో గ్రూపునకు రూ.15 వేల రివాల్వింగ్‌ ఫండ్‌ అందించడం జరుగుతుంది. మహిళల సాధికారత కోసం ఇప్పటికే బ్యాంక్‌ లింకేజీ, సీ్త్రనిధి రుణాలు అందజేస్తున్నాం.

– రఘువరణ్‌, డీఆర్డీఏ పీడీ

ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు ఆదేశాలు

ఒక్కో సంఘానికి రూ.15 వేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement