జగిత్యాల: ప్రతీ కుటుంబం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి నమోదు చేసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి అన్నారు. శుక్రవారం జగిత్యాల మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టారని, ప్రజలకు మేలు చేసే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, కౌన్సిలర్ గంగలక్ష్మి, భాగ్య, శ్రీనివాస్, స్వప్న, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.


