పుష్కర పనులు గడువులోగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

పుష్కర పనులు గడువులోగా పూర్తి చేయాలి

Nov 19 2026 12:13 AM | Updated on Nov 19 2026 12:13 AM

ధర్మపురి: గోదావరి పుష్కరాల సందర్భంగా వివిధ ఆలయాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. ధర్మపురిలోని శ్రీఉగ్రనృసింహస్వామి దేవాలయం పునఃనిర్మాణ పనులను పరిశీలించారు. గోదావరి ఒడ్డును చేపడుతున్న పుష్కరఘాట్లు, రోడ్లు, హెలీప్యాడ్‌, మహాలక్ష్మి ఘాట్‌ నుంచి వీఐపీ ఘాట్‌ పరిశీలించారు. వచ్చే ఏడాది జూలైలో జరిగే పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు రానున్నందున వారికి సరిపడా వసతులు చేపట్టాలని సూచించారు. పనుల్లో నాణ్యత తప్పనిసరి అన్నారు. పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌ రహదారులు, రాకపోకలు, ఇతర సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఆర్డీవో మధుసూదన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నాగలక్ష్మి, మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ గంగాధర్‌, ఆలయ ఈవో శ్రీనివాస్‌, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ అధికారులు, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో రవీందర్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement