నిరుపేదలందరికీ పథకాలు
జగిత్యాల/జగిత్యాలరూరల్/జగిత్యాలటౌన్:
నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలో జగిత్యాల రూరల్, అర్బన్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరుపత్రాలు అందించారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కెరీర్ గైడెన్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. చదువుతోపాటు వ్యక్తిత్వం అలవర్చుకోవాలన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజెంగి నందయ్య, గ్రంథాలయ చైర్మన్ సంగనభట్ల దినేష్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, కమిషనర్ సత్యప్రణవ్, నాయకులు గిరి నాగభూషణం, రేపల్లె హరికృష్ణ, జుంబర్తి గంగ, పంబాల సుజాత పాల్గొన్నారు.
రీసర్వే పకడ్బందీగా చేపట్టాలి
జగిత్యాలరూరల్/రాయికల్: భూ రీసర్వేను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ ప్రసునాంబ అన్నారు. సారంగాపూర్ మండలం పోతారం, బీర్‌పూర్ మండలం సిరిపూర్, రాయికల్ మండలంలోని ఆలూర్, వీరాపూర్ గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియను పరిశీలించారు. తప్పులు లేకుండా చూడాలన్నారు. భూములు, హద్దులు, విస్తీర్ణం వివరాలు పరిశీలించి నమోదు చేయాలన్నారు. తహసీల్దార్‌లు వైవోద్దిన్ నాగార్జున ఉన్నారు.
వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్యాలి
జగిత్యాల: వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అదనపు కలెక్టర్ ప్రసూనాంబ అన్నారు. కలెక్టరేట్‌లో బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్‌కుమార్ పాల్గొన్నారు.
ప్రాణాలు రక్షించడమే నిజమైన సేవ
జగిత్యాలరూరల్: ప్రాణాలు రక్షించేందుకు చేసిన సేవ అత్యున్నతమైందని రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జగిత్యాలరూరల్ మండలం లక్ష్మీపూర్‌లో బాలికల జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లకు సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎదుటివారి ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన ప్రాథమిక చికిత్స విధానంపై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. సర్పంచ్ నల్ల కవిత, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగాం అధికారి కొట్టాల తిరుపతి రెడ్డి, సీపీఆర్ ట్రైనర్ రాధాకిషోర్, అధ్యాపకులు శిల్ప, మాధవి పాల్గొన్నారు.
విద్యార్థుల నుంచి రూ.2 లక్షలు రికవరీ
కోరుట్ల: తమను సతాయిస్తున్నాడనే కోపంతో కోరుట్ల సంక్షేమ బాలుర గురుకులం విద్యార్థులు వాచ్‌మన్ తిరుమల్‌పై దాడికి పాల్పడిన విషయం తెల్సిందే. ఆయన బైక్‌ను ధ్వంసం చేశారు. ఘటనను ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. దాడికి పాల్పడిన 20 విద్యార్థులను ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ అశోక్ రెడ్డి సస్పెండ్ చేశారు. మరో ఐదుగురికి టీసీలు ఇచ్చారు. ఫర్నిచర్ ధ్వంసం చేసినందుకు రూ.2 లక్షలు రికవరీ చేయాలని నిర్ణయించినట్టు అశోక్‌రెడ్డి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దనే ఉద్దేశంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.


