అక్రమాలకు చెక్ పడేనా..?
జగిత్యాల: జిల్లాలో సుమారు 10వేలకు పైగా వాణిజ్య వ్యాపార కేంద్రాలున్నాయి. ఇందులో చిన్నాచితక కేవలం 500వరకు ఉంటాయి. మిగతావన్నీ పెద్దపెద్ద వ్యాపార కేంద్రాలే. వాస్తవానికి ఎవరైనా వ్యాపారం చేపడితే మున్సిపాలిటీలో అయితే బల్దియా నుంచి ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో మున్సిపల్ అధికారులైనా వారికి ట్రేడ్ లైసెన్స్ జారీ చేయాలి. వ్యాపారులు ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని సంబంధిత అధికారులు పరిశీలించి ఎంత ఫీజు చెల్లించాలో నిర్ధారిస్తారు. వచ్చిన డబ్బు బల్దియా ఖజానాకు చేరుతుంది. కానీ.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లోని కొన్ని వ్యాపార సముదాయాలు ట్రేడ్ లైసెన్స్ లేకుండానే కొనసాగుతున్నాయంటే అతిశయోక్తికాదు. ఫలితంగా మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇటీవల జిల్లాకేంద్రంలోని కొన్ని వ్యాపార సముదాయాలకు నోటీసులు జారీ చేస్తున్నారు.
కొలతల్లో మాయాజాలం
గతంలో ట్రేడ్‌లైసెన్స్ జారీలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. జగిత్యాల టవర్ సర్కిల్ ప్రాంతంలో ఓ షాపింగ్‌మాల్ యజమాని ట్రేడ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అది రెండంతస్తులుంటే ఒక్క అంతస్తుకే లైసెన్స్ జారీ చేశారు. ఇలా జిల్లాలోని మున్సిపాలిటీల్లో ట్రేడ్ లైసెన్స్ జారీలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. షాపింగ్ మాల్ యజమానులతో కుమ్మకై ్కన అధికారులు ట్రేడ్ లైసెన్స్ జారీ చేసి అందినంతా పుచ్చుకున్నట్లు తెలిసింది. అమ్యామ్యాలు ఇచ్చేందుకు అలవాటు పడినవారు ఇప్పుడు ట్రేడ్ లైసెన్స్ తీసుకునేందుకుగానీ.. రెన్యువల్‌కుగానీ ముందుకు రావడం లేదు. దీంతో మున్సిపల్ అధికారులు మూడు టీంలను ఏర్పాటు చేశారు. ట్రేడ్ లైసెన్స్ లేని షాపులను గుర్తించి.. నోటీసులు జారీ చేస్తున్నారు. 147 జీవో ప్రకారం చదరపు అడుగుల లెక్కన ట్రేడ్ లైసెన్స్ రుసుం వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ట్రేడ్ లైసెన్స్ ఎంతో ముఖ్యం
మున్సిపాలిటీల్లో వ్యాపారం చేసుకుంటే ట్రేడ్‌లైసెన్స్ ఎంతో అవసరం. షాపునకు రుణం తీసుకోవాలన్నా బ్యాంక్ వారు ట్రేడ్ లైసెన్స్ అడుగుతారు. అలాగే ఏదైనా ప్రమాదం జరిగినా ఇన్సూరెన్స్, ఇతరత్రా అందే అవకాశం ఉంటుంది.
ట్రేడ్ లైసెన్స్ ధరలు ఇలా..
సింగిల్ లైన్ 20 ఫీట్ల రోడ్
: రూ.3 (స్క్వేర్ ఫీట్)
డబుల్‌లైన్ 30 ఫీట్ల రోడ్
: రూ.4 (స్క్వేర్ ఫీట్)
మల్టీపుల్ లైన్ 30 ఫీట్లకు పైగా
: రూ.5 (స్క్వేర్ ఫీట్)
మినిమం ట్రేడ్ లైసెన్స్ ఫీజు
: రూ.4 నుంచి రూ.7 (స్క్వేర్ ఫీట్)
ప్రస్తుతం టీంలు ఏర్పాటు చేయడంతో అక్రమాలకు చెక్‌పడే అవకాశాలున్నాయి. గతంలో నిబంధనల్లోని కొన్ని లొసుగులను ఆధారంగా చేసుకున్న షాపుల నిర్వాహకులు అధికారులతో కుమ్మకై ్క అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈసారి ప్రతి షాపును క్షుణ్ణంగా పరిశీలించి ట్రేడ్ లైసెన్స్ జారీ చేసే అవకాశాలున్నాయి.
ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి
షాపుల నిర్వాహకులు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నాం. మూడు టీమ్‌లను నియమించాం. ఇది వ్యాపారులకు ఎంతో ముఖ్యం. ప్రతి ఒక్క షాపును పరిశీలించి ట్రేడ్ లైసెన్స్ లేకపోతే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం.
– సత్యప్రణవ్, మున్సిపల్ కమిషనర్


