అఘాయిత్యాలకు పాల్పడితే శిక్షలు కఠినం | - | Sakshi
Sakshi News home page

అఘాయిత్యాలకు పాల్పడితే శిక్షలు కఠినం

Nov 17 2026 12:14 AM | Updated on Nov 17 2026 12:14 AM

● సబ్‌ జడ్జి నాగేశ్వర్‌ రావు ● మెట్‌పల్లి జూనియర్‌ సివిల్‌ జడ్జి మాధవి

● సబ్‌ జడ్జి నాగేశ్వర్‌ రావు

జగిత్యాలజోన్‌: బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే చట్టంలో కఠిన శిక్షలు ఉన్నాయని సబ్‌ జడ్జి నాగేశ్వర్‌ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని బాల సదన్‌ను సోమవారం సందర్శించారు. బాలికలు ఏ సమస్య వచ్చినా తల్లితండ్రులకు చెప్పాలని సూచించారు. చదువుకునే పిల్లలు వాట్సాప్‌, యూట్యూబ్‌, ఇన్‌స్ట్రాగాం వంటి సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. జిల్లా లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ కటుకం చంద్రమోహన్‌, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ అనురాధ, బాల సదన్‌ ఇన్‌చార్జి కె.కావ్య పాల్గొన్నారు.

చెడు వ్యసనాలకు దూరం ఉండాలి

మెట్‌పల్లి: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటేనే అనుకున్న లక్ష్యం చేరే అవకాశముంటుందని మెట్‌పల్లి జూనియర్‌ సివిల్‌ జడ్జి మాధవి అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మత్తు పదార్థాలతో కలిగే శారీరక, మానసిక అనర్థాలను వివరించారు. చట్టపరంగా ఎదురయ్యే ఇబ్బందులు తెలిపారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏలేటి రాంరెడ్డి, పలువురు న్యాయవాదులు ఉన్నారు.

పిల్లల ప్రజావాణి

జగిత్యాల: బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకుని కలెక్టరేట్‌లోని ప్రజావాణి ప్రాంగణంలో పిల్లల కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఆదేశాల మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంరక్షణ ఆధ్వర్యంలో హెల్ప్‌డెస్క్‌ ప్రారంభించారు. అక్కడకు వచ్చిన వారికి పిల్లల హక్కులు, బాల్య వివాహ నిరోధక, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. సమస్యలుంటే చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098కు ఫోన్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి భాస్కర్‌, డీసీపీవో సురేశ్‌, పీవో కరుణశ్రీ పాల్గొన్నారు.

సాంకేతిక మార్పులపై అవగాహన ఉండాలి

మెట్‌పల్లి: సాంకేతిక మార్పులపై పోలీస్‌ సిబ్బంది ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని ఎస్పీ అశోక్‌కుమార్‌ సూచించారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ను సోమవారం సందర్శించారు. కేసులు, పెండింగ్‌ కేసుల పురోగతి, నేరాల నేయంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి పలు అంశాలపై సూచనలు చేశారు. డీఎస్పీ రాములు, సీఐ సురేష్‌బాబు, ఎస్‌ఐలు కిరణ్‌కుమార్‌, అనిల్‌, రాజునాయక్‌, శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో మోడల్‌స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ

జగిత్యాలరూరల్‌: కండ్లపల్లి మోడల్‌స్కూల్‌లో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న శ్రీవాణి రంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్‌ అండర్‌ –19 బాలికల విభాగంలో అత్యంత ప్రతిభ కనబర్చి తృతీయస్థానం సాధించినట్లు పాఠశాల పీడీలు అజీమ్‌, వినీత్‌ తెలిపారు. శ్రీవాణిని సోమవారం పాఠశాల ప్రిన్సిపాల్‌ సరితదేవి, వైస్‌ ప్రిన్సిపల్‌ నగేశ్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement