సన్నాలకు ధర లేదంటూ రైతుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

సన్నాలకు ధర లేదంటూ రైతుల ధర్నా

Nov 17 2026 12:14 AM | Updated on Nov 17 2026 12:14 AM

● సంఘీభావం ప్రకటించిన మాజీమంత్రి జీవన్‌ రెడ్డి ● అన్నదాతలతో కలిసి ఆందోళన

జగిత్యాలఅగ్రికల్చర్‌: సన్నాలకు మొన్నటివరకు రూ.4వేలు ఇచ్చి.. ఇప్పుడు రూ.2500 మించి పెట్టడం లేదని, మార్కెట్‌లో పోస్తే కొనుగోలు చేయడం లేదంటూ రైతులు సోమవారం జగిత్యాల–నిజామాబాద్‌ రహదారిపై ధర్నా నిర్వహించారు. వీరికి మాజీమంత్రి జీవన్‌ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత సంఘీభావం తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. ధాన్యం కొనాలంటూ ఓ మహిళా రైతు సీఐ కరుణాకర్‌ కాళ్లు మొక్కి వేడుకోవడం గమనార్హం. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన వైఖరి చెప్పేవరకు కదిలేది లేదంటూ భీష్మించుకుర్చున్నారు. చల్‌గల్‌ మార్కెట్‌లో 25 ఎకరాల స్థలం ఉన్నా.. ఇరుకుగా ఉన్న జగిత్యాల మార్కెట్‌ కొనుగోళ్లు చేపట్టడం ద్వారా సమస్యలు వస్తున్నాయని, మార్కెట్‌ నిండినప్పుడలా సెలవు ఇవ్వడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. పంట చేతికొచ్చే సమయానికి సిండికేట్‌గా మారి వ్యాపారులు ధర తగ్గిస్తే రైతులు ఎలా బతకాలని ప్రశ్నించారు. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇవ్వాల్సి వస్తుందని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం లేదని ఆరోపించారు. వ్యవసాయం చేయడం కంటే ఏదైనా దుకాణాల్లో పనిచేయడం బెటర్‌ అంటూ రైతులు చెబుతుండటం అక్కడున్న వారిని ఆలోచనలో పడేసింది. మార్కెట్‌యార్డులో రైతులు మాట్లాడుతున్న సమయంలో మార్కెట్‌ కార్యదర్శి అక్కడి నుంచి వెళ్లిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement