బాలికల రక్షణకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ | - | Sakshi
Sakshi News home page

బాలికల రక్షణకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌

Nov 17 2026 12:14 AM | Updated on Nov 17 2026 12:14 AM

● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి ● ఆయా జిల్లాలోని సెషన్స్‌ కోర్టుల్లో కేసుల విచారణ

● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి

జగిత్యాలజోన్‌: బాలబాలిక రక్షణకు న్యాయ సేవా అధికార సంస్థ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేసిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి అన్నారు. సంబంధిత పోస్టర్‌ను కోర్టులో సోమవారం ఆవిష్కరించారు. మహిళలపై జరిగే హింస, వేధింపులు, బాలకార్మికులు, అక్రమ రవాణా, గృహహింస వంటి రక్షణ, భద్రతకు సంబంధించిన హెల్ప్‌లైన్‌ నంబర్లు పోస్టర్‌లో ఉంటాయన్నారు. బాలల సహాయానికి 1098, మహిళల సహాయానికి 181, మహిళా పోలీస్‌ హెల్ప్‌లైన్‌ 1091, అత్యవసర పోలీస్‌ సహాయానికి 112, సైబర్‌ నేరాల ఫిర్యాదులకు 1930, ఉచిత న్యాయ సహాయం కోసం 15100, అంబులెన్స్‌ సేవలకు 108, అగ్నిమాపక సేవలకు 101నంబర్లు ఉంటాయని, వీటిని ప్రజలు అవసరమైన సమయాల్లో ఉపయోగించాలని సూచించారు. హెల్ప్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేస్తే పేర్లు గోప్యంగా ఉంచుతారని వివరించారు. మొదటి అదనపు జిల్లా జడ్జి సునీత, సబ్‌ జడ్జి నాగేశ్వర్‌ రావు, మొదటి అదనపు జ్యూడిషియల్‌ మేజిస్ట్రేట్‌ యేగి జానకి, జిల్లా లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ కటుకం చంద్రమోహన్‌, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ విజయకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీ కోర్టులకు పుల్‌స్టాప్‌

జగిత్యాలజోన్‌: ఇకనుంచి ఎస్సీ, ఎస్టీ కోర్టులుండవని, ఆయా జిల్లాలోని సెషన్స్‌ కోర్టుల్లోనే కేసుల విచారణ కొనసాగుతుందని హైకోర్టు రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో మాత్రమే ఎస్సీ, ఎస్టీ కోర్టులు ఉండేవి. ఆ కోర్టుల్లో మాత్రమే ఎస్సీ, ఎస్టీ కేసులు విచారించేది. దీనివల్ల కక్షిదారులు రవాణా సమస్యతో ఇబ్బంది పడుతుండేవారు. జిల్లాల విభజన తర్వాత ప్రతి జిల్లాలో సెషన్స్‌ కోర్టులు ఏర్పాటయ్యాయి. ఆ కోర్టులనే ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ కోర్టులుగా మార్చుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాకు మొదటి అదనపు జిల్లా జడ్జి కోర్టు, కరీంనగర్‌ జిల్లాకు మూడో అదనపు జిల్లా జడ్జి కోర్టు, పెద్దపల్లి జిల్లాకు జిల్లా ప్రధాన కోర్టు, రాజన్న సిరిసిల్ల జిల్లాకు మొదటి అదనపు జిల్లా కోర్టులను ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ సెషన్స్‌ కోర్టులుగా మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement