అర్హులందరికీ సంక్షేమ ఫలాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

Nov 17 2026 12:14 AM | Updated on Nov 17 2026 12:14 AM

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

జగిత్యాల/ధర్మపురి/పెగడపల్లి: అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. ధర్మపురి, పెగడపల్లిలో కొత్త చేయూత పింఛన్‌ పత్రాలు అందించారు. సామాజిక భద్రత పింఛన్లతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు భరోసా కలుగుతుందన్నారు. ధర్మపురిలో అడిషనల్‌ కలెక్టర్‌ ప్రసూనాంబ, మున్సిపల్‌ చైర్‌పర్స్‌న్‌ వేముల నాగలక్ష్మి రాజు, డీఆర్‌డీఏ పీడీ రఘువరణ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రామన్న, కౌన్సిలర్లు, పెగడపల్లిలో సర్పంచులు అరుణ, లక్ష్మణ్‌, గోపాల్‌, బలరాం రెడ్డి, కుమార్‌, వనజ, ఏఎంసీ చైర్మన్‌ రామగౌడ్‌, డీఆర్‌డీవో పీడీ రఘువరణ్‌, ఎంపీడీవో ప్రేమ్‌సాగర్‌, తహసీల్దార్‌ సయ్యద్‌ నిజామొద్దీన్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు తిరుపతి పాల్గొన్నారు.

బంజారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

బంజారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జగదాంబ మాత ఆలయాల భూమిపూజలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఆలయ నిర్మాణంతో ఆధ్యాత్మికత పెరుగుతుందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి కృషి చేస్తున్న బంజార సంఘం ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య, జిల్లా సేవాలాల్‌ సమితి అధ్యక్షుడు భూక్య నందునాయక్‌, జగిత్యాల, రాయికల్‌ ఏఎంసీ చైర్మన్లు నారాయణరెడ్డి, రవీందర్‌రావు, కౌన్సిలర్‌ ప్రశాంత్‌రావు, జిల్లా మహిళ అధ్యక్షురాలు అడువాల జ్యోతి, మాజీ ఎంపీపీ సంధ్యారాణి, సేవాలాల్‌ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి మాలోతు లచ్చునాయక్‌, రవినాయక్‌, రాజేందర్‌నాయక్‌, ప్రసాద్‌, సంతోష్‌, రమేశ్‌, తిరుపతి, సాగర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement