హోమాలు.. పారాయణాలు | - | Sakshi
Sakshi News home page

హోమాలు.. పారాయణాలు

Nov 17 2026 12:14 AM | Updated on Nov 17 2026 12:14 AM

● కొండగట్టులో ఆధ్యాత్మిక పరిమళాలు ● స్వామివారి చందనం తొలగింపు.. ● బాలాలయంలో స్వామివారి దర్శనం

రాజగోపురంపై

కలశాల ప్రతిష్ఠాపన కోసం ఏర్పాట్లు

మల్యాల: శ్రీఆంజనేయస్వామివారి చందనోత్సవాల్లో భాగంగా వేద మంత్రోచ్ఛరణలు.. పారాయణాలు.. హోమాలతో కొండగట్టులో ఆధ్యాత్మిక పరిమళాలు విరబూస్తున్నాయి. ఆదివారం నుంచి మూలమూర్తి దర్శనం నిలిపివేయడంతో బాలాలయంలో చెక్కతో కూడిన స్వామివారి రూపాన్ని భక్తులు దర్శించుకుంటున్నారు. యాగశాలలో ద్వారతోరణార్చన, అగ్ని ప్రతిష్ఠ, పూర్ణాహుతి, బలిదానం శాత్తుమొరై, తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించారు. ఈనెల 21 నుంచి స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు కొండగట్టుకు తరలిరానున్నారు. స్వామివారికి ప్రతి మంగళవారం, శనివారాల్లో చందనం పూసి.. ప్రత్యేక పూజలు చేస్తున్న విషయం తెల్సిందే. 60ఏళ్ల అనంతరం ఈనెల 15 నుంచి చందనోత్సవాలు నిర్వహిస్తున్నారు. జువ్వి, మేడి, రావి, ధరమి, మర్రి వృక్షాల నుంచి సేకరించిన కర్ర, వెండి, బంగారం, రాగి, పంచలోహాలు కలిసిన పనిముట్లతో స్వామివారిపై పేరుకుపోయిన చందనం తొలగిస్తున్నారు. యాగశాలలో త్రికుండాత్మక హోమం చేస్తున్నారు. ఈనెల 20న ఇద్దరు జీయర్‌ స్వాములతో కుంభాభిషేకం, రాజగోపురం, స్వామివారి ప్రధాన ఆలయంపై సుదర్శన చక్రం, శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంపై కలశం, అమ్మవారి ఆలయంపై కలశం, ఉత్తర ద్వారంపై కలశాలు ప్రతిష్టించి, మహా సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement