జగిత్యాల: చెరువుల పరిరక్షణే ధ్యేయమని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం చింతకుంట చెరువును పరిశీలించారు. చెరువుల్లో మురికినీరు కలవకుండా చర్యలు తీసుకుంటున్నామని, అమృత్ 2.0 పథకం కింద మోతె, చింతకుంట, రాయికల్పెద్ద చెరువు అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని, శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, చెరువుల సహజ స్వరూపాన్ని కాపాడుతూ భావితరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేపడతామన్నారు. గతంలో మున్సిపల్లో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న సీనియర్ నాయకులు, వారి కుటుంబ సభ్యులు పట్టణ అభివృద్ధి, చెరువుల పరిరక్షణపై చర్యలు చేపట్టలేదని విమర్శించారు. గతంలో అక్రమ నిర్మాణాలపై జీవన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, కమిషనర్ సత్యప్రణవ్, ఈఈ ఖాన్, డీఈ వరుణ్, తహసీల్దార్ రాంమోహన్, టీపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.


