గిరిజనులకు బాసటగా ‘న్యాయ సేవ’ | - | Sakshi
Sakshi News home page

గిరిజనులకు బాసటగా ‘న్యాయ సేవ’

Nov 14 2026 12:53 AM | Updated on Nov 14 2026 12:53 AM

● జగన్నాథపూర్‌ను దత్తత తీసుకున్న జాతీయ న్యాయసేవాధికార సంస్థ ● గ్రామస్తులకు అందనున్న పథకాలు

రాయికల్‌: మండలంలోని మారుమూల గిరిజన గ్రామం జగన్నాథపూర్‌ను జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దత్తత తీసుకున్నట్లు జిల్లా సేవాధికార సంస్థ కార్యదర్శి సరిత తెలిపారు. ఈనేపథ్యంలో జిల్లాలోనే వందశాతం గిరిజనులు ఉన్న జగన్నాథపూర్‌లో ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అనే అంశాలను మొదటగా పారా లీగల్‌ వలంటీర్లతో ఇంటింటా సర్వే చేయనున్నారు. గ్రామంలో కుటుంబాలు, కులాల వివరాలు, అక్షరాస్యత శాతం, వయోవృద్ధులు తదితర అంశాలను సేకరిస్తారు. నివేదిక ఆధారంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి గిరిజనులకు కావాల్సిన సదుపాయాలు, రెవెన్యూ, న్యాయ, విద్య, వైద్యం పరంగా ఆయా శాఖలతో సేవలు అందించనున్నారు. స్వయంగా అధికారులే గ్రామ బాట పట్టి గిరిజనులకు సౌకర్యాలు కల్పిస్తారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గిరిజనులకు అన్నిరకాల సేవలు

మా గ్రామాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దత్తత తీసుకోవడం ఆనందంగా ఉంది. దీంతో మా గ్రామంలో పారా లీగల్‌ వలంటీర్లు సర్వే నిర్వహించి ప్రభుత్వ పథకాలను గిరిజనులకు అందించేందుకు కృషి చేయడం జరుగుతుంది.

– పరంచ శంకర్‌, సర్పంచ్‌

గ్రామ ప్రొఫైల్‌..

వార్డులు 8

జనాభా 859

ఓటర్లు 659

గృహాలు 242

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement