మౌలిక వసతుల కల్పనకు కృషి
వెల్గటూర్: పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం మండలంలోని కుమ్మరిపల్లె మోడల్‌స్కూల్‌లో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బెంచీలు పంపిణీ చేశారు. స్కూల్‌లో సదుపాయాల కోసం ఎంపీ లాడ్స్ నుంచి రూ.10 లక్షలు తక్షణమే మంజూరు చేశారు. అలాగే ఎండపల్లి మండలం గుళ్లకోట గ్రామ గౌడ సంఘానికి కమ్యూనిటీ భవన్ గోడ, ఫంక్షన్ హాల్‌కురూ.10లక్షల ఎంపీ లాడ్స్ నిధులు మంజూరు చేశారు.
గడి బురుజు స్థలం ట్యాక్స్ రద్దు చేయాలి
కోరుట్ల: పట్టణంలోని గడి బురుజు స్థలంపై మున్సిపాలిటీ విధించిన వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ తక్షణమే రద్దు చేయాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. శుక్రవారం బీఆర్‌ఎస్ కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ తిరుమల వసంత, కమిషనర్ రాఘవేంద్రకు వినతిపత్రం సమర్పించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా గడి బురుజు స్థలాలను రక్షించాల్సిన అవసరం మున్సిపాలిటీపై ఉందన్నారు. అలాగే ప్రజాకవి కాళోజి నారాయణరావు వర్ధంతి సందర్భంగా పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే నివాళి అర్పించారు.
అక్రమ నిర్మాణం తొలగింపు
అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే చర్యలు
మెట్‌పల్లి: సన్నబియ్యం అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని 6వార్డులో రైస్‌మిల్లర్స్, ట్రేడర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్నబియ్యం విక్రయ దుకాణాన్ని శుకవ్రారం ప్రారంభించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు బియ్యం విక్రయించాలనే ఉద్దేశంతో ఈ దుకాణాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. డీటీసీఎస్ ఉమాపతి, ఎఫ్‌డీటీసీఎస్ రాజేంద్రప్రసాద్, వ్యాపారులు కోట గంగాధర్, దొంతుల నాగభూషణం, కంభంపాటి కిరణ్, మహాజన్ శివకుమార్, దొంతుల పవన్, చింత గణేశ్, నూనె కిషన్, ముక్క సంజీవ్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.


