చేతిపంపులకు జీవం | - | Sakshi
Sakshi News home page

చేతిపంపులకు జీవం

Nov 14 2026 12:53 AM | Updated on Nov 14 2026 12:53 AM

కొడిమ్యాల: ఎల్‌నినో ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొడిమ్యాలను కరువు మండలంగా ప్రకటించింది. బోర్లు, బావుల్లో నీటిమట్టాలు రోజురోజుకూ పడిపోతుండడంతో మండలవ్యాప్తంగా ప్రజలు తాగునీటి కోసం మళ్లీ పాత రోజుల్లో లాగా చేతిపంపులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిషన్‌ భగీరథ, ఇతర తాగునీటి పథకాలు ఉన్నా భూగర్భజలాలు పడిపోవడంతో గ్రామాల్లోని బోర్లు ఎండిపోతున్నాయి. మండలవ్యాప్తంగా ఆయా గ్రామాల్లో మొత్తం 288 చేతి పంపులు, బోరుబావులు ఉండగా, అందులో దాదాపు 30 శాతం వరకు మరమ్మతుకు వచ్చాయి.

15 నుంచి స్పెషల్‌ డ్రైవ్‌

మండలంలో నెలకొన్న నీటిఎద్దడిపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించారు. కరువు పరిస్థితులను అధిగమించడానికి, నిరుపయోగంగా మారిన జలవనరుల పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈనెల 15 నుంచి మండలవ్యాప్తంగా చేతి పంపులు, బోర్లపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నారు. ప్రత్యేక సాంకేతిక సిబ్బంది, మెకానిక్‌లను బృందాలుగా విభజించి స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా రిపేర్‌లో ఉన్న చేతిపంపులు, బోర్‌ బావులను బాగు చేయనున్నారు. అవసరమైన చోట కొత్త పైపులు వేయడం, మోటార్లు మార్చడం, బోర్లను లోతుగా చేయడం వంటి పూర్తి చేయనున్నారు.

వాడుకలోకి తెస్తాం

కొడిమ్యాలను కరువు మండలంగా ప్రకటించడంతో బోరుబావులు, చేతిపంపుల రిపేర్‌పై ఈనెల 15 నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తాం. పాడయిన బోర్లు, చేతిపంపులను తిరిగి వాడుకలోకి తెస్తాం. ప్రజలు తాగునీటిని వృథా చేయొద్దు. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సహకరించాలి.

– కల్పన, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement