అంధకారంలో బల్దియా | - | Sakshi
Sakshi News home page

అంధకారంలో బల్దియా

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

ఇది మోతె చౌరస్తా సమీపంలోని బైపాస్‌రోడ్‌. ఇక్కడ అత్యధికంగా చెట్లు పెరిగిపోవడంతో లైటింగ్‌ వ్యవస్థ కన్పించడం లేదు. ఇందులో లైట్లన్నీ మొత్తానికే వెలగకపోవడంతో ఓ చిట్టడివిని తలపిస్తున్నాయి. ఇళ్లకు సంబంధించిన లైటింగ్‌ వ్యవస్థనే రోడ్డుపైకి కొద్దిగా వస్తుంది. రాత్రి 9 గంటలు దాటిందంటే చిమ్మ చీకట్లే..

ఇది యావర్‌రోడ్డు. డివైడర్ల మధ్య సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటు చేశారు. చాలాచోట్ల లైట్లు వెలగడంలేదు. ప్రధాన రహదారి కావడం, అత్యధికంగా షాపులు ఉండటంతో జనసందోహం అధికంగా ఉంటుంది. సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌కు మరమ్మతు చేయకపోవడం మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

ఇది జిల్లాకేంద్రంలోని గొల్లపల్లి శ్మశాన వాటిక వైపు వెళ్లే బైపాస్‌రోడ్‌. సుందరీకరణ పేరుతో రోడ్‌లో మొక్కలు ఏర్పాటు చేశారు. మొక్కలు ఏపుగా పెరిగి వీధి దీపాలను మించిపోయాయి. ఫలితంగా రోడ్డంతా చీకటిగా మారింది. ప్రస్తుతం వీధి దీపాలు మొత్తానికే వెలగడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement