● డీఎంహెచ్‌వో సుజాత
జగిత్యాల: బాల్య వివాహాలతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని, స్కానింగ్ కేంద్రాల్లో నిబంధనలు పాటించాలని డీఎంహెచ్‌వో సుజాత అన్నారు. వైద్యశాఖ కార్యాలయంలో పీసీ పీఎన్‌డీటీ చట్ట నిబంధనలపై అడ్వైజరీ కమిటీ సమావేశంలో మాట్లాడారు. బాల్య వివాహాలు జరగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. వైద్యులు స్కానింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని, ఫారం ఎఫ్ రికార్డులు సక్రమంగా నిర్వహించాలన్నారు. మాతాశిశు సంక్షేమాధికారి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతినెలా ఐదో తేదీలోపు ఫాం ఎఫ్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 89 స్కానింగ్ కేంద్రాలు అనుమతి పొంది ఉన్నాయని, ఆయా కేంద్రాలు చట్ట నిబంధనల తప్పనిసరిగా పాటించాలన్నారు. కార్యక్రమంలో గైనకాలజిస్ట్‌లు కనకదుర్గ, విశ్వభారతి, స్నేహ పాల్గొన్నారు.


