రాయికల్: కేంద్ర ప్రభుత్వ పథకాలను హస్త కళాకారులు సద్వినియోగం చేసుకోవాలని హస్తకళల ప్రోత్సాహక అధికారి ప్రవీణ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని శాలివాహన సంక్షేమ సంఘంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాకారులకు గుర్తింపుకార్డులు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, కేంద్ర ప్రభుత్వ రుణాలు, బీమా వంటి పథకాలపై అవగాహన కల్పించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మామిడిపల్లి కృష్ణ, యూత్ అధ్యక్షుడు నరేశ్, ప్రధాన కార్యదర్శి గంగాధరి సురేశ్, పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి హన్మండ్లు, ఉపాధ్యక్షుడు కొత్తపల్లి ప్రసాద్, కార్యదర్శి వినోద్, సంఘ నాయకులు పాల్గొన్నారు.


