వ్యవసాయంలో కూలీల కొరత తీవ్రమతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సాగు ఖర్చులు తగ్గించి, రైతులకు లాభసాటిగా మార్చేందుకే ప్రభుత్వం కస్టమ్ హైరింగ్ సెంటర్లను (సీహెచ్‌సీ) ప్రోత్సహిస్తోంది. ఈ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు కూడా ఖరీదైన ఆధునిక యంత్రాలు తక్కువ అద్దెకే అందుబాటులోకి వస్తాయి. విత్తనం వేయడం మొదలుకుని కోత, ప్రాసెసింగ్ వరకు అత్యాధునిక పరికరాలను సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ఒక్కో యూనిట్‌పై రూ.20 లక్షల వరకు రాయితీ ఇస్తోంది. కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది. అర్హత గల రైతు గ్రూపులు, మహిళా సంఘాలు, పీఏసీఎస్ సంఘాలు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అన్నదాతలు యంత్ర సాగు వైపు అడుగులు వేయాలని కోరుతున్నాం.


