లైంగికంగా వేధిస్తే కఠిన శిక్షలు | - | Sakshi
Sakshi News home page

లైంగికంగా వేధిస్తే కఠిన శిక్షలు

Oct 30 2026 12:39 AM | Updated on Oct 30 2026 12:39 AM

● జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సరిత

జగిత్యాలజోన్‌: పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే శిక్షలు కఠినంగా ఉంటాయని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి మట్ట సరిత అన్నారు. జిల్లాకేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో పోక్సో చట్టంపై గురువారం అవగాహన కల్పించారు. అనంతరం పోస్టర్‌ ఆవిష్కరించారు. విద్యార్థినులకు ఎలాంటి సమస్య ఎదురైనా ధైర్యంగా కుటుంబసభ్యులకు తెలపాలన్నారు. అసభ్యకర మెసేజ్‌లు వస్తే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి సురేష్‌, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.

పెండింగ్‌ కేసులు పరిష్కరించాలి

● ధర్మపురి జూనియర్‌ సివిల్‌ జడ్జి

ధర్మపురి: పెండింగ్‌ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి యోగి జానకీ అధికారులకు సూచించారు. ధర్మపురి కోర్టులో గురువారం వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. వివిధ కారణాలతో నమోదైన కేసుల పరిష్కారంలో పోలీస్‌శాఖ కీలక పాత్ర పోషించాలన్నారు. పీపీ, సీఐ రాంనర్సింహరెడ్డి, ఎస్సైలు సధాకర్‌, శ్రీకాంత్‌ తదితరులున్నారు.

రాయికల్‌ తహసీల్దార్‌ కార్యాలయం తనిఖీ

రాయికల్‌: పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయాన్ని అడిషనల్‌ కలెక్టర్‌ ప్రసూనాంబ గురువారం తనిఖీ చేశారు. భూభారతి, ప్రజావాణి, భూ సమస్యలపై తహసీల్దార్‌ నాగార్జునను అడిగి తెలుసుకున్నారు. ఉప్పుమడుగులో కొనసాగుతున్న రీసర్వేను పరిశీలించారు. ఆమెను స్వర్ణకార సంఘం సభ్యులు సంజీవచారి, దుర్శెట్టి రంగయ్య, ఆంజనేయులు, గోపి, శ్రీనివాస్‌, ప్రసాద్‌ సన్మానించారు.

అంజన్న సన్నిధిలో అటవీ శాఖ అధికారి పూజలు

మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామివారిని జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసాద్‌ గురువారం దర్శించుకున్నారు. ఆయనను ఆలయ ఈవో అంజనారెడ్డి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి 180ఎకరాల అటవీస్థలం కేటాయించాలని ఈవో కోరగా.. డీఎఫ్‌వో సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఇప్పటికే సర్వే పూర్తి చేశామని పేర్కొన్నారు. ఎఫ్‌ఆర్‌వో పద్మారావు, డీఆర్వో శ్రీనివాస్‌, సురేశ్‌ రావు, ఎఫ్‌బీవో అశ్విని పాల్గొన్నారు.

మోతె చెరువు నీరు వృథా

జగిత్యాలజోన్‌: ఎల్‌నినోతో నీటి సమస్యలు ఉత్పన్నమవుతున్న తరుణంలో పట్టణాన్ని ఆనుకుని ఉన్న మోతె చెరువు నుంచి నీరు వృథాగా కిందకు వెళ్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ చెరువులో నీరుంటే.. సగం పట్టణానికి తాగునీరు అందించే అవకాశం ఉంటుంది. మత్తడి సరిగ్గా లేకపోవడంతో నీరు వృథాగా వెళ్తుండడంతో నీటిమట్టం రోజురోజుకూ తగ్గిపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement