● మంజూరైన 11 కేంద్రాల్లో రిజర్వేషన్ల ప్రకారం జనరల్ కేటగిరీకి 9, ఎస్సీకి 1, ఎస్టీకి 1 చొప్పున కేటాయించారు.
● రైతు మిత్ర గ్రూపులు, మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), రైతు పరస్పర సంఘాలు అర్హులు.
● ఆసక్తిగల సంఘాలు అధికారిక వెబ్‌సైట్ agrimachinery. nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
● దరఖాస్తుల పరిశీలన అనంతరం కలెక్టర్ చైర్మన్‌గా.. వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో కూడిన కమిటీ లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తుంది.
● విత్తనం నాటే దశ నుంచి పంట కోత, ధాన్యం ఆరబెట్టే వరకు అధునాతన పరికరాలు చౌకగా అద్దెకు లభిస్తాయి. దీంతో రైతులకు సమయం, కూలీల ఖర్చు భారీగా ఆదా అవుతాయి.
● పరికరాలను రైతులకు అద్దెకివ్వడం ద్వారా నిర్వహణ సంఘాలకు శాశ్వత ఆదాయం సమకూరి ఆర్థిక స్వావలంబన లభిస్తుంది.
● పవర్ టిల్లర్, ఎలక్ట్రిక్ టిల్లర్, డిస్క్‌ప్లా, కల్టివేటర్, రోటవేటర్, రోటోపుడ్లర్, సబ్ సాయిలర్, బండ్ ఫార్మర్, విత్తనాలు, ఎరువుల డ్రిల్, మల్టీ క్రాప్ ప్లాంటర్, రైజ్డ్ బెడ్ ప్లాంటర్, ప్లాస్టిక్ మల్చింగ్ యంత్రం.
● స్ప్రేయర్లు, ట్రాక్టర్ బూమ్ స్ప్రేయర్, ఆధునిక కిసాన్ డ్రోన్, పవర్ వీడర్, కలుపు కోసే యంత్రాలు.
● కంబైన్డ్ హార్వెస్టర్, మొక్కజొన్న హార్వెస్టర్, మల్టీక్రాప్ థ్రెషర్, వరి మొబైల్ డ్రయ్యర్, స్ట్రా బేలర్, పసుపు ఉడికించే యంత్రం, పసుపు పాలిషర్, రోటరీ గ్రేడర్.
గొల్లపల్లి: వ్యవసాయ రంగంలో కూలీల కొరతను అధిగమించి, ఉత్పాదకతను పెంచేందుకు ప్రభుత్వం యంత్రసాగుకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు 11 కస్టమ్ హైరింగ్ సెంటర్లను (సీహెచ్‌సీ) మంజూరు చేసింది. ఖరీదైన ఆధునిక సాగు యంత్రాలను కొనుగోలు చేయలేని చిన్న, సన్నకారు రైతులకు అద్దె ప్రాతిపదికన పరికరాలను అందుబాటులోకి తేవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఒక్కో యూనిట్ విలువపై గరిష్టంగా 40 శాతం (రూ.20 లక్షల వరకు) సబ్సిడీని ప్రభుత్వం అందించనుంది.
పారదర్శకంగా ఎంపిక
రైతులకు మేలు.. సంఘాలకు ఆర్థిక ఊతం
అందుబాటులోకి రానున్న ఆధునిక యంత్రాలివే
జిల్లాకు 11 కస్టమ్ హైరింగ్ సెంటర్లు మంజూరు
ఒక్కో యూనిట్‌పై రూ.20 లక్షల వరకు రాయితీ
చిన్న, సన్నకారు రైతులకు తగ్గనున్న ఖర్చు