మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలోని 14 హుండీలకు భక్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 76 రోజులకు రూ.1.23 కోట్లు, 68 విదేశీ కరెన్సీ సమకూరినట్లు ఆలయ ఈవో అంజనా రెడ్డి తెలిపారు. మిశ్రమ వెండి, బంగారం బ్యాగులో వేసి, సీల్ వేసి, తిరిగి హుండీల్లో భద్రపరిచారు. నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ భక్తులు రాసిన లేఖ హుండీలో లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఏఈవో హరిహరనాథ్, సూపరింటెండెంట్ సునీల్‌కుమార్, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.


