వ్యవసాయ పనులు లేక ఉపాధి బాట ఎల్‌నినో ప్రభావంతో పెరిగిన సంఖ్య జిల్లాలో జాబ్‌కార్డులు 99,500 అనుమతి పొందిన పనులు 13,612 పనుల విలువ రూ.23.06 కోట్లు పనులకు వస్తున్న కూలీలు 14,000
జగిత్యాలరూరల్:వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ పనులు లేక ఇబ్బంది పడుతున్న గ్రామీణ కూలీలకు వీబీజీరాంజీ పథకం ఆసరాగా నిలుస్తోంది. అర్హులకు కొత్త జాబ్ కార్డులు మంజూరు చేస్తూ.. జిల్లాలోని 385 గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులను ముమ్మరం చేశారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీకి కూలీల సంఖ్య పెరుగుతోంది.
నూతన పనులకు శ్రీకారం
జిల్లా వ్యాప్తంగా వీబీజీ రామ్‌జీ పథకం కింద చెక్‌డ్యామ్‌లు, ఇంకుడుగుంతలు, వ్యవసాయ కుంటల నిర్మాణం, చెరువుల్లో పూడికతీత, ఇందిరమ్మ ఇళ్ల మరుగుదొడ్ల నిర్మాణం, చెట్లకు కాలువలు చేయడం వంటి పనులను అధికారులు వేగవంతం చేశారు. ప్రభుత్వం కూలీలకు 250 పని దినాలు కల్పిస్తూ, రోజుకు రూ.308 చొప్పున కూలి చెల్లిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 99,500 జాబ్ కార్డులు ఉండగా, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే కార్డులు మంజూరు చేస్తున్నారు.
ఉపాధికి పెరగనున్న డిమాండ్
యాసంగి పంటల సాగు రైతులు ఆశించిన స్థాయిలో వ్యవసాయ పనులు ఉండే అవకాశం లేకపోవడంతో.. నవంబర్ నుంచి ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య భారీగా పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 14 వేల మంది కూలీలు పనులకు హాజరవుతుండగా.. డిమాండ్‌కు తగినట్లు రూ.23.06 కోట్లతో 13,612 పనులను చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి పనులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.


