నిజాయితీ, పారదర్శకత ఉద్యోగి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

నిజాయితీ, పారదర్శకత ఉద్యోగి బాధ్యత

Oct 30 2026 12:33 AM | Updated on Oct 30 2026 12:33 AM

జగిత్యాల: ప్రజాసేవలో నిజాయితీ, పారదర్శకత ఉద్యోగి బాధ్యత అని అదనపు కలెక్టర్‌ ప్రసూనాంబ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాలను అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజాసేవలో నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలన్నారు. అవినీతి నివారణ కేవలం ఒక శాఖ బాధ్యత మాత్రమే కాదని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతి అధికారి, ఉద్యోగి బాధ్యతగా పనిచేయాలన్నారు. ప్రజలకు అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా అందించడంతోపాటు, దరఖాస్తులను అనవసరంగా పెండింగ్‌లో ఉంచకూడదన్నారు. డీఎస్పీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ..ఉద్యోగులు నైతిక బాధ్యతగా ఉంటూ ఎలాంటి ప్రలోభాలకు తావివ్వకుండా చట్టానికి లోబడి విధులు నిర్వర్తించాలని సూచించారు. అనంతరం ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement