ఘరానా దొంగ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఘరానా దొంగ అరెస్ట్‌

Oct 29 2026 12:18 AM | Updated on Oct 29 2026 12:18 AM

కరీంనగర్‌ రూరల్‌: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న దొంగను బుధవారం రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నిరంజన్‌రెడ్డి వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం అల్లీపూర్‌కు చెందిన బాలసాని అజయ్‌ ఇంటర్‌ చదువుతుండగానే దొంగతనాలకు అలవాటుపడ్డాడు. గతంలో మానకొండూరు మండలం ఊటూరు బ్యాంకు దోపిడీ, సుల్తానాబాద్‌లో జరిగిన మూడు దొంగతనాల్లో అరెస్టయ్యాడు. 2025లో హైదరాబాద్‌కు వెళ్లి ఓ షాపింగ్‌మాల్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తుండగా సెక్యూరిటిగార్డు రాజుతో కలిసి నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లిలోని ఓ ఇంట్లోకి చొరబడి రెండున్నర తులాల బంగారం, కొంత నగదు ఎత్తుకెళ్లారు. గత ఆగస్టులో బొమ్మకల్‌ పరిధిలోని విజయ్‌నగర్‌ కాలనీలోని ఓ ఇంట్లోకి ప్రవేశించి పావుతులం బంగారం, 25 తులాల వెండి అపహరించాడు. పోలీసులకు ఆనవాళ్లు దొరకకుండా కారం పొడి చల్లి తప్పించుకపోయాడు. నాట్‌ గ్రిడ్‌ యాప్‌ ద్వారా అజయ్‌ అనవాళ్లను సేకరించిన పోలీసులు బుధవారం బొమ్మకల్‌లోని దాబా వద్ద పట్టుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement