పంట వేయబోమని రైతులతో ఒప్పందాలా? | - | Sakshi
Sakshi News home page

పంట వేయబోమని రైతులతో ఒప్పందాలా?

Oct 29 2026 12:18 AM | Updated on Oct 29 2026 12:18 AM

● మాజీమంత్రి జీవన్‌రెడ్డి

జగిత్యాలరూరల్‌: పంటలు వేయబోమని రైతులతో ఒప్పందాలు రాయించుకోవడం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. సారంగాపూర్‌ మండలం రంగపేటలో రైతులతో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావం ఉందని, కరువు వస్తుందని, పంటలకు నీరు ఇవ్వబోమని, విద్యుత్‌ సరఫరా చేయలేమని చేతులెత్తేయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన వనరులు అందుబాటులో ఉన్నా.. కొరత ఎందుకు ఏర్పడుతోందని ప్రశ్నించారు. ఆయన వెంట నాయకులు తేలు రాజు, అనంతుల గంగారెడ్డి, దావ తిరుపతి, రామడుగు రవి, వెంకటేశ్‌, సుధాకర్‌, నరేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement