● డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్
జగిత్యాల: హెచ్ఐవీ వ్యాధికి నివారణే మార్గమని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎయిడ్స్ నివారణ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. హెచ్ఐవీ వ్యాప్తి మార్గాలు, పరీక్షలు, చికిత్స ప్రాముఖ్యతను వివరించారు. హెచ్ఐవీ బాధితుల పట్ల వివక్షత చూపరాదన్నారు. రేస్ అగెనెస్ట్ హెచ్ఐవీ నినాదంతో యువతకు పరుగుపందెం నిర్వహించారు. ప్రొఫెసర్ ఇందిరాదేవి, కో–ఆర్డినేటర్ రాజేందర్రెడ్డి, మురళి పాల్గొన్నారు.


