రక్తదానానికి ముందుకు రావాలి | - | Sakshi
Sakshi News home page

రక్తదానానికి ముందుకు రావాలి

Oct 29 2026 12:12 AM | Updated on Oct 29 2026 12:12 AM

● ఎస్పీ అశోక్‌కుమార్‌ ● ధర్మపురిలో బీజేపీ రాస్తారోకో

● ఎస్పీ అశోక్‌కుమార్‌

జగిత్యాలక్రైం: రక్తదానం చేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా ట్రాిఫిక్‌ శిక్షణ కేంద్రంలో బుధవారం రక్తదాన శిబిరం ప్రారంభించారు. కార్యక్రమానికి యువత నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, పోలీసు అధికారులను అభినందించారు. డీఎస్పీలు పురుషోత్తంరెడ్డి, డీఎంహెచ్‌వో సుజాత, సీఐలు సుధాకర్‌, కరుణాకర్‌, రాజ్‌కుమార్‌, తిరుపతి, వేణు, సైదులు, ఐఎంఏ సభ్యులు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కరించాలి

జిల్లాకేంద్రంలో ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కరించాలని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ను బుధవారం తనిఖీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా విధులు నిర్వర్తించాలన్నారు. ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, విద్యాసంస్థల పరిసరాలు, బస్టాండ్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రిపుల్‌ రైడింగ్‌, హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ ధరించని వాహనదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నృసింహుని హుండీ ఆదాయం రూ.59.97 లక్షలు

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆ లయ ప్రాంగణంలో బుధవారం ఆలయ హుండీలకు భక్తుల ద్వారా వచ్చిన కానుకలను లెక్కించారు. 127రోజులకు గాను రూ.59,97,771 సమకూరినట్లు ఈవో శ్రీనివాస్‌ తెలిపారు. 42 గ్రాముల మిశ్రమ బంగారం, 3.400 కిలోల మిశ్రమ వెండి, 40 విదేశీనోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ నాయిని సుప్రియ, అర్చకులు, సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు తదితరులున్నారు.

విద్యార్థులు మత్తుకు దూరంగా ఉండాలి

జగిత్యాల: మత్తు రహిత సమాజ నిర్మాణం లక్ష్యమని, విద్యార్థులు మత్తుకు దూరంగా ఉండాలని రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో బుధవారం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. జూనియర్‌ కళాశాల నుంచి తహసీల్‌ చౌరస్తా మీదుగా టవర్‌ నుంచి పాతబస్టాండ్‌ వరకు ర్యాలీ తీశారు. విద్యార్థి దశలో చెడు అలవాట్లకు ఆకర్షితులు కాకుండా ఉన్నత లక్ష్యాల వైపు మళ్లాలని సూచించారు. యువత ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం గవర్నర్‌ సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. నశాముక్త్‌ భారత్‌ అభియాన్‌ లక్ష్యాలు, మాదక ద్రవ్యాల నిర్మూలనలో యువత పాత్ర, ఆరోగ్య సమాజ నిర్మాణం వంటి అంశాలపై గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా వివరించారు. ఎస్‌కేఎన్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ నాగభూషణం, తిరుపతిరె డ్డి, ఉమాదేవి, నరేందర్‌గౌడ్‌, మధుకర్‌, రవి బాబు, సురేశ్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.

ఆస్పత్రిని అందుబాటులోకి తేవాలని..

ధర్మపురి: రూ.కోట్లతో నిర్మించిన పట్టణంలోని మాతాశిశు ఆస్పత్రిని వినియోగంలోకి తేవాలని డిమాండ్‌ చేస్తూ.. బీజేపీ నాయకులు బుధవారం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ.. ఆస్పత్రి వినియోగంలోకి రాకపోవడంతో మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే వైద్యులను నియమించాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రిలో సేవలు లేక గర్భిణులు జగి త్యాల, కరీంనగర్‌ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఆస్పత్రిని వినియోగంలోకి తేకపోతే ప్రజల పక్షాన ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఆందోళనలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement