జిల్లాపై కరువు పడగ | - | Sakshi
Sakshi News home page

జిల్లాపై కరువు పడగ

Oct 29 2026 12:12 AM | Updated on Oct 29 2026 12:12 AM

వెంటాడిన వర్షాభావం నిండని చెరువులు, కుంటలు మూడు మండలాల్లోనే కరువంటూ సర్కారు ప్రకటన అన్ని మండలాలను గుర్తించాలంటూ ఆందోళనలు

మేడిపల్లిలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు

జగిత్యాలరూరల్‌ మండలం పొరండ్లలో ఎండిపోయిన పంటను మేస్తున్న పశువులు

జగిత్యాలరూరల్‌: జిల్లాను కరువు వెంటాడుతోంది. వానాకాలంలో నెలకొన్న వర్షాభావం, ఎల్‌నినో ప్రభావం, నేలలో పడిపోయిన తేమ శాతం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా మూడు మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ జీవో ఎంఎస్‌ నంబర్‌ 3 విడుదల చేసింది. జగిత్యాల, జగిత్యాలరూరల్‌, కొడిమ్యాల మండలాలలో కరువు ఉన్నట్లు ప్రభుత్వం నిర్ధారించింది. జూన్‌ ఒకటి నుంచి సెప్టెంబర్‌ 30 వరకు నమోదైన వర్షపాత లోటును అంచనా వేసిన సర్కార్‌.. తక్షణమే సహాయక చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళికలు సమర్పించాలని వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించింది.

పడిపోయిన భూగర్భజలాలు

ఎల్‌నినో ప్రభావంతో భూగర్భజలాలు ఇప్పుడే అడుగంటాయి. వర్షకాలంలో రైతులు ముఖ్యంగా వరిపంట సాగుచేసేవారు. కానీ వరిపంట సాగుచేసిన రైతులు కొన్ని చోట్ల వర్షాలు లేకపోవడంతో సాగునీరు, విద్యుత్‌ కోతలతో సతమతమవుతున్నారు. ఇప్పటికే కొందరి రైతుల పంటలు ఎండిపోయాయి. యాసంగి పంటలు సాగు చేయవద్దని, కొద్దిపాటి నీటితో సాగయ్యే పంటలపైనే దృష్టి సారించాలని ప్రభుత్వం సూచిస్తోంది.

కరువు మండలాలుగా ప్రకటించాలని..

మేడిపల్లి/కథలాపూర్‌: మేడిపల్లి, భీమారం, కథలాపూర్‌ మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలని బీజేపీ నాయకులు బుధవారం ఆందోళనకు దిగారు. మేడిపల్లిలో నిజామాబాద్‌–జగిత్యాల రహదారిపై బైఠాయించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల సురేష్‌, నాగం శివకుమార్‌, క్యాతం దశరథరెడ్డి, రెబ్బస్‌ మల్లయ్య, తొగరి లక్ష్మిపతి, కొప్పెర లింగరెడ్డి, అన్నాడి జలపతి రెడ్డి, కథలాపూర్‌లో కిసాన్‌మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కొడిపెల్లి గోపాల్‌రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు మల్యాల మారుతి, నాయకులు మహేశ్‌, నరెడ్ల రవి, ఆరెల్లి శివ, ఆనంద్‌రెడ్డి, గాంధారి శ్రీనివాస్‌, పల్లికొండ ప్రసాద్‌, జిల్లా సత్యం, లింగం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement