ధర్మపురి: ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన మండలంలోని మగ్గిడి గురుకులం పాఠశాలకు చెందిన విద్యార్థి హన్షల్ జాతీయస్థాయికి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రమేశ్ తెలిపారు. హన్షల్ ఇటీవల నారాయణపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–14 రెజ్లింగ్ పోటీలు నిర్వహించారు. ఇందులో బంగారు పతకం అందుకున్నాడు. ఈనెల 31న ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటాడని తెలిపారు. ప్రిన్సిపాల్, పీడీ సంతోష్, కోచ్ వినయ్ హన్షల్ను అభినందించారు.
రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి మోడల్‌స్కూల్ విద్యార్థి సాత్విక్ ఎస్జీఎఫ్ అండర్ –14 విభాగంలో రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికై నట్లు పీడీలు అజీమ్, వినిత్ తెలిపారు. సాత్విక్‌ను ప్రిన్సిపల్ సరితాదేవి, వైస్ ప్రిన్సిపల్ నాగేశ్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
కబడ్డీ పోటీలకు చల్గల్ విద్యార్థి..
చల్గల్ జెడ్పీ పాఠశాలకు చెందిన రిషిక రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు పీడీ వెంకటలక్ష్మీ తెలిపారు. సత్తుపల్లిలో నిర్వహించే పోటీల్లో రిషిక పాల్గొనున్నట్లు తెలిపారు. రిషికను హెచ్ఎం చంద్రశేఖర్, సర్పంచ్ జున్ను రాజేందర్, ఎస్ఎంసీ చైర్మన్ నీరటి సుకన్య అభినందించారు.
రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా లక్ష్మణ్
మెట్పల్లి: రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పట్టణానికి చెందిన బత్తుల లక్ష్మణ్‌ను నియమించినట్లు అధ్యక్షుడు నాయికోటి రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో లక్ష్మణ్ సంఘంలో పలు పదవులు నిర్వహించారు. ఆయన నియామకంపై పలువురు డీలర్లు హర్షం వ్యక్తం చేశారు. డీలర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.


