ప్రభుత్వ భూముల్లో మట్టి తీస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూముల్లో మట్టి తీస్తే చర్యలు

Oct 1 2026 4:52 AM | Updated on Oct 1 2026 4:52 AM

● జిల్లా మైనింగ్‌ అధికారి జైసింగ్‌

జగిత్యాలరూరల్‌: ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టి తీస్తే చర్యలు తప్పవని జిల్లా మైనింగ్‌ అధికారి జైసింగ్‌ అన్నారు. బుధవారం జగిత్యాలరూరల్‌ మండలం నర్సింగాపూర్‌ శివారులోని ప్రభుత్వ భూమిని జిల్లా మైనింగ్‌ అధికారి జైసింగ్‌, రూరల్‌ తహసీల్దార్‌ హకీం సందర్శించారు. అనుమతి లేకుండా మట్టి తీయొద్దంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమి నుంచి మట్టి తీయకుండా రహదారి వెంట కందకాలు తవ్వించామని, నర్సింగాపూర్‌ శివారు సర్వే నంబరు 437 పరిసర ప్రాంతాల్లో మట్టి తీసేందుకు అనుమతి లేదని తెలిపారు. ఎవరైనా మట్టిని తరలిస్తే వాహనాలను జప్తు చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో ఆర్‌ఐ శంషోద్దీన్‌, సిబ్బంది శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement