ఆమె గురి ‘బంగారమే’ | - | Sakshi
Sakshi News home page

ఆమె గురి ‘బంగారమే’

Oct 1 2026 4:52 AM | Updated on Oct 1 2026 4:52 AM

● పల్లె నుంచి ప్రపంచ వేదిక దాకా ● తొలిదశలోనే రెండు స్వర్ణాలు సాధించిన చికిత ● ఉమ్మడి కరీంనగర్‌ క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయం

అద్భుత ప్రదర్శన

ఐచి–నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత జోడీ చికిత తానిపర్తి, సాహిల్‌ జాదవ్‌ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం కై వసం చేసుకున్నారు. ఫైనల్‌ పోరులో కొరియాను షూట్‌–ఆఫ్‌లో చిత్తు చేసి, భారతదేశానికి బంగారు పతకాన్ని అందించారు. ఈ చరిత్రాత్మక విజయంతో 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌కు కాంపౌండ్‌ ఆర్చేరీ విభాగంలో భారత్‌ తరఫున తొలి అధికారిక కోటాను ఖరారు చేశారు.

వ్యవసాయ కుటుంబం నుంచి..

సాధారణ వ్యవసాయ కుటుంబంలో చికిత జన్మించింది. వ్యవసాయ పొలాల్లోని గడ్డివాములనే లక్ష్యాలుగా మార్చుకుని విలువిద్యలో తొలి అడుగులు వేసింది. కూతురి ప్రతిభను గుర్తించిన తండ్రి శ్రీనివాసరావు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించడానికి అప్పులు చేశారు. తండ్రి త్యాగాలు, కష్టాలను వృథా పోనివ్వని చికిత ఆసియా గేమ్స్‌ వేదికపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేసి దేశం గర్వించేలా చేసింది. సోదరుడు యశ్వంత్‌ కూడా అక్క బాటలో నడుస్తూ జాతీయ విలువిద్య పోటీల్లో రాణిస్తుండడం విశేషం.

ఒకేరోజు సరికొత్త రికార్డు

ఆసియా క్రీడల్లో చికిత తనిపర్తి బుధవారం ఒకేరోజు రెండు బంగారు పతకాలతో సరికొత్త రికార్డు సృష్టించింది. మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌కంటే ముందు జరిగిన మహిళల కాంపౌండ్‌ టీమ్‌ ఫైనల్లో జ్యోతి సురేఖ వెన్నం, ప్రీతికా ప్రదీప్‌తో కలిసి బరిలోకి దిగిన చికిత.. చైనా జట్టుపై 238–234 తేడాతో విజయం సాధించి జట్టుకు తొలిస్వర్ణాన్ని అందించింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే సాహిల్‌ జాదవ్‌తో కలిసి మిక్స్‌డ్‌ టీమ్‌లో కొరియాపై గెలిచి డబుల్‌ గోల్డ్‌శ్రీతో మెరిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement