అదనపు కలెక్టర్‌ లత ఉద్యోగ విరమణ | - | Sakshi
Sakshi News home page

అదనపు కలెక్టర్‌ లత ఉద్యోగ విరమణ

Oct 1 2026 4:52 AM | Updated on Oct 1 2026 4:52 AM

జగిత్యాల: అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత సేవలు అమోఘమని, జిల్లాను అగ్రస్థానంలో నిలపడంలో ఆమెపాత్ర ఎంతో గొప్పదని, పాడి ప్రొక్యూర్‌మెంట్‌ సేకరణలో ఆమె కృషి వెలకట్టలేనిదని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. అదనపు కలెక్టర్‌ లత ఉద్యోగ విరమణ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్స్‌లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అడిషనల్‌ కలెక్టర్‌గా ఆమె పనితీరు ఎంతో గొప్పదన్నారు. పాడి ప్రొక్యూర్‌మెంట్‌లో రైతులు హైపర్‌ యాక్టివ్‌గా ఉంటారని, ఎక్కడా పొరపాట్లు లేకుండా 80 శాతం పనులు చేసేవారని గుర్తు చేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులు ఆమెను ఘనంగా సత్కరించారు. అదనపు కలెక్టర్లు రాజాగౌడ్‌, ఆర్డీవో మధుసూదన్‌, డీఆర్డీవో రఘువరణ్‌, కందుకూరి రవిబాబు, నాగేందర్‌రెడ్డి, వకీల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement