జగిత్యాలక్రైం: జిల్లాలో పనిచేస్తున్న నలుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ అశోక్‌కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్బీలో పనిచేస్తున్న ఎస్.శ్రీకాంత్‌ను బుగ్గారం ఎస్సైగా, బుగ్గారం ఎస్సై సతీశ్‌ను నిర్మల్ జిల్లాకు(వీఆర్), డీఎస్బీలో పనిచేస్తున్న కుమారస్వామిని పెగడపల్లి ఎస్సైగా, పెగడపల్లి ఎస్సై కిరణ్‌కుమార్‌ను జగిత్యాల టౌన్ ఎస్సై–1గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
బీఆర్‌ఎస్, బీజేపీ నాయకుల అరెస్టు
మేడిపల్లి: సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన సందర్భంగా బుధవారం బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులను పోలీస్‌లు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్టు చేసిన వారిలో చెన్నమనేని అజిత్‌రావు, గాజోజి చారి, అంబారి రాము, సంపత్ కుమార్, నాగం శివకుమార్, చిట్యాల సురేష్, క్యాతం దశరథరెడ్డి ఉన్నారు.
ప్రజా గొంతుకను అణిచివేయడం సరికాదు
జగిత్యాలరూరల్: సిరిసిల్లలో సీఎం పర్యటన పేరుతో ప్రజా గొంతుకలను అణచివేయడం సరికాదని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. సీఎం పర్యటన సందర్భంగా వసంతతోపాటు సురేశ్‌ను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా సంచరించే హక్కు, ప్రజలను కలుసుకునే హక్కు, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేసే హక్కు ఉందన్నారు. తనను హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.


