ప్రైవేట్ బడుల ఇష్టారాజ్యానికి తెర అందుబాటులోకి ‘పీఎస్‌సీఎంఎస్’పోర్టల్ ఆన్‌లైన్‌లో నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం విస్తృత ప్రచారం కల్పిస్తేనే సత్ఫలితాలు
గొల్లపల్లి: ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి కళ్లెం వేసేందుకు విద్యాశాఖ సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. పుస్తకాలు, యూనిఫాంలు, పరీక్షల పేరి ట తల్లిదండ్రుల జేబులు గుల్ల చేస్తున్న యాజమాన్యాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పీఎస్‌సీఎంఎస్ (ప్రైవేట్ స్కూల్ కంప్లైంట్ మానిటరింగ్ సిస్టం) పోర్టల్‌ను అమల్లోకి తెచ్చింది. అధిక వసూళ్లపై విద్యార్థుల తల్లిదండ్రులు నిర్భయంగా నేరుగా ఫిర్యాదు చేసేందుకు ఇది వేదికగా నిలవనుంది.
లెక్కాపత్రం లేని వసూళ్లు.. బెంబేలెత్తుతున్న పేరెంట్స్
జిల్లా వ్యాప్తంగా 299 ప్రైవేట్ పాఠశాలల్లో 83,880 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను తుంగలో తొక్కి ట్యూషన్ ఫీజులకే పరిమితం కాకుండా.. డైరీలు, బెల్టులు, పుస్తకాలు, యూనిఫాంలు, సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రశ్నిస్తే పిల్లలను ఎక్కడ వేధిస్తారోనన్న భయంతో తల్లిదండ్రులు మిన్నకుండిపోతున్నారు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ డిజిటల్ పర్యవేక్షణ విధానాన్ని తెరపైకి తెచ్చింది.
ఫిర్యాదు ఇలా చేయాలి
ప్రచారం ఉంటేనే ఫలితం
నిబంధనలు మీరితే చర్యలు తప్పవు
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందకుండా పీఎస్‌సీఎంఎస్ పోర్టల్‌లో ఆధారాలతో ఫిర్యాదు చేయవచ్చు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపడతాం.
– రాము, డీఈవో


