శోభాయాత్ర శాంతియుతంగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

శోభాయాత్ర శాంతియుతంగా చేపట్టాలి

Sep 23 2026 12:13 AM | Updated on Sep 23 2026 12:13 AM

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

రాయికల్‌/ధర్మపురి: వినాయకుని శోభాయాత్ర శాంతియుతంగా నిర్వహించుకోవాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సూచించారు. రాయికల్‌లోని వాగు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. విగ్రహాలను భక్తిశ్రద్ధల మధ్య శోభాయాత్ర నిర్వహించా లని, ఎలాంటి సంఘటనలూ జరగకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో విద్యుద్దీదీపాల ఏర్పాటు, వైద్య శిబిరం, భారీక్రేన్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచా లన్నారు. అనంతరం ధర్మపురి గోదావరి వద్ద ఏర్పా ట్లు, రూట్‌మ్యాప్‌ పరిశీలించారు. చిన్న విగ్రహాలను ధర్మపురిలో.. భారీ విగ్రహాలను రాయపట్నం వంతెన వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. శోభాయాత్రకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఎస్పీ అశోక్‌కుమార్‌, ఆర్డీవో మధుసూదన్‌, డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్లు కట్కం రవి, వేముల నాగలక్ష్మి, కమిషనర్లు, మనోహర్‌గౌడ్‌, శ్రీనివాస్‌, రాయికల్‌ తహసీల్దార్‌ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి పాల్గొన్నారు.

‘టీబీ ముక్త్‌భారత్‌’కు కృషి చేయాలి

జగిత్యాల: క్షయరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన టీబీ ముక్త్‌ కార్యక్రమంలో మాట్లాడారు. వైద్య పరీక్షలు నిర్వహించి టీబీ బాధితులను గుర్తించాలన్నారు. జిల్లాస్థాయి కమిటీ సభ్యులు, డీఎంహెచ్‌వో సుజాత, టీబీ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, రఘువరణ్‌, డీఈవో రాము, లేబర్‌ అధికారి సురేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement