విభిన్న రూపాల్లో గణనాథులు
జగిత్యాల: జిల్లాలో విక్రయిస్తున్న సరుకులన్నీ కల్తీమయంగా మారుతున్నాయి. కారంపొడి నుంచి పసుపు, నూనె, నెయ్యి, పాలు, మసాలాలు ఇలా అన్నిట్లోనూ కల్తీ కనిపిస్తోంది. ఆహారభద్రత శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా మారింది. కిరాణం షాపుల్లో కారం పొట్లాలు, మిక్చర్ ప్యాకెట్లు కవర్‌లో ప్యాక్ చేసి స్టిక్కర్లు లేకుండా గడువు తేదీ లేకుండా విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏ వస్తువులౖపైనెనా గడువు తేదీ.. ధర.. తయారీ తేదీ తప్పనిసరిగా ఉండాలి. అయితే వీటిలో కల్తీ జరగడంతోనే గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్వాలిటీ లేని నూనెలు వాడుతూ కారంపొట్లం, ఇతర వస్తువులు తయారు చేస్తున్నారు. స్వీట్‌హౌస్‌లలోనూ ఇదే పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల వారు వీటిని కొనుగోలు చేసుకుని అనారోగ్యం పాలవుతున్నారు. లడ్డూలు, బాదూషా, మైసూర్‌పాక్‌లు, కేక్‌లు తదితర పదార్థాలన్నీ కిలోల కొద్ది తయారుచేసి కవర్లు కప్పకుండా గ్లాస్‌లో పెడుతున్నారు. రోజుల తరబడి విక్రయిస్తూనే ఉన్నారు. ఈగలు, దోమలు వాలుతున్నా.. అధికారులు కనీస తనిఖీ చేయకపోవడంతో ప్రజలకు అంటగడుతున్నారు.
లోపిస్తున్న అపరిశుభ్రత
స్వీట్ హౌస్‌లు, బేకరీల్లో తిను బండారాలను అపరిశుభ్ర వాతావరణంలోనే చేస్తున్నారు. బ్రెడ్స్, కేక్‌లు, స్వీట్లు బేకరీల్లోనే చేస్తున్నారు. కొన్ని బేకరీల్లో ఎలుకలు, పందికొక్కులు సంచరిస్తున్నాయి. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ బేకరీలో బ్రెడ్‌లో ఈగ రావడంతో కొనుగోలుదారుడు ప్రశ్నించాడు కూడా. ఆహార భద్రత శాఖ అధికారులు వచ్చి శాంపిల్స్ సేకరించారు. ఇలా ప్రతి స్వీట్ హౌస్‌లు, బేకరీల్లో ఇష్టానుసారంగా కల్తీ చేసి విక్రయిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మానవ జీవనంలో పాలు, కారం, పసుపు వంటివి అవసరం. వీటిని కూడా కొందరు కల్తీ చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కల్తీనూనెల వ్యాపారం చేస్తున్న వారు హోటళ్లను ఎంచుకుంటున్నారు. హోల్‌సేల్ ద్వారా డబ్బాల్లో నింపి విక్రయిస్తున్నారు. అది ఏనూనో ఎవరికీ తెలియదు. టీ పౌడర్స్, కరెంట్ పైపులు, బోర్డులు, పౌడర్లు, ఫేస్‌క్రీమ్‌లు మార్కెట్‌లో ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారు. ఇటీవల జిల్లాకేంద్రంలో డూప్లికేట్ ఆశీర్వాద్ పైపులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
కవర్లు కప్పి విక్రయిస్తున్న స్వీట్లు, ఇతర తినుబండారాలు
కల్తీ అల్లం పేస్ట్


